Naatu Naatu : ఇంకా తగ్గని నాటు నాటు క్రేజ్.. వైరల్ అవుతున్న బేస్ బాల్ స్టేడియం!

ఆస్కార్ అందుకున్న తరువాత కూడా నాటు నాటు (Naatu Naatu) సాంగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా జపాన్ లో జరుగుతున్న ఒక బేస్ బాల్ మ్యాచ్ లో నాటు నాటు సాంగ్ మోత మోగిపోయింది.

Naatu Naatu : ఇంకా తగ్గని నాటు నాటు క్రేజ్.. వైరల్ అవుతున్న బేస్ బాల్ స్టేడియం!

Naatu Naatu performance at japan packed stadium in between a Base ball game

Updated On : April 12, 2023 / 12:06 PM IST

Naatu Naatu : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంతటి ప్రజాధారణ పొందిందో అందరికి తెలుసు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ (NTR) అండ్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి చిందేసిన మాస్ నెంబర్ నాటు నాటు (Naatu Naatu) సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కర్ని ఉర్రూతలూగించింది. దీంతో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న నాటు నాటు.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ (Oscar) ని కూడా అందుకొని ప్రపంచ విజేతగా నిలిచింది. ఇక RRR రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అవుతున్నా నాటు నాటు క్రేజ్ మాత్రం అసలు తగ్గడం లేదు.

SSMB 28 : డ్యూయల్ రోల్ లో మహేశ్.. త్రివిక్రమ్ – మహేశ్ సినిమా SSMB28 కూడా పాన్ ఇండియానా??

ఇటీవలే ఐపీల్ (IPL) స్టార్టింగ్ ఈవెంట్ లో నాటు నాటు సాంగ్ తో స్టేడియం మొత్తం మోత మోగిపోయింది. ఐపీల్ లో ఈ పాటకి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) డాన్స్ చేసి అలరించింది. తాజాగా జపాన్ లో జరుగుతున్న ఒక బేస్ బాల్ మ్యాచ్ లో నాటు నాటు సాంగ్ మోత మోగిపోయింది. స్టేడియం మొత్తం జనాలతో నిండిపోయిన ఆ స్టేడియంలో మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు నాటు నాటు సాంగ్ కి చీర్ గర్ల్స్ చిందేశారు. దీని ఒక ఇండియన్ నెటిజెన్ వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీనికి RRR టీం రియాక్ట్ అవుతూ హార్ట్ సింబల్స్ తో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే, రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ SSMB29 కోసం అందరు వేచి చూస్తున్నారు. ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉండబోతుంది అని రాజమౌళి తెలియజేసిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో చూడాలి.