K3 Kotikokkadu: సుదీప్ ‘K3 కోటికొక్కడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

క‌న్న‌డ సూపర్ స్టార్ సుదీప్ తెలుగులో తన మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. ఇటీవల సుదీప్ ‘విక్రాంత్ రోణ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాకుండా భారీ కలెక్షన్‌లు కూడా రాబట్టాడు. గ‌తేడాది క‌న్న‌డ‌లో విడుద‌లై బ్లాక్‌బాస్ట‌ర్‌ హిట్‌గా నిలిచిన ‘కోటీగ‌బ్బా-3’ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో విడుద‌ల‌కు సిద్ధం చేశాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘K3 కోటికొక్క‌డు’ అనే టైటిల్‌తో మేక‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు.

Sudeep Kichcha K3 Kotikokkadu Realease Date Locked

K3 Kotikokkadu: క‌న్న‌డ సూపర్ స్టార్ సుదీప్ తెలుగులో తన మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. ఇటీవల సుదీప్ ‘విక్రాంత్ రోణ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాకుండా భారీ కలెక్షన్‌లు కూడా రాబట్టాడు. ఇక ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌తో హీరో సుదీప్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అయితే ఇప్పుడు తెలుగులో తన మార్కెట్‌ను పెంచుకునేందుకు మరోసారి రెడీ అయ్యాడు ఈ కన్నడ హీరో.

Kichha Sudeep : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ.. విరాట్ కోహ్లీ ఫామ్ లాంటిది..

అయితే హీరో సుదీప్ గతంలో ‘ర‌క్త చ‌రిత్ర’, ‘ఈగ‌’, ‘బాహుబ‌లి’, ‘సైరా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే గ‌తేడాది క‌న్న‌డ‌లో విడుద‌లై బ్లాక్‌బాస్ట‌ర్‌ హిట్‌గా నిలిచిన ‘కోటీగ‌బ్బా-3’ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో విడుద‌ల‌కు సిద్ధం చేశాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘K3 కోటికొక్క‌డు’ అనే టైటిల్‌తో మేక‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల కానుంది. నిజానికి ఈ చిత్రం జూలైలోనే విడుద‌ల కావాల్సి ఉంది. అయితే మేకర్స్ విక్రాంత్ రోణ ఫ‌లితం త‌ర్వాత ఈ చిత్రాన్నివిడుద‌ల చేయాల‌ని భావించారు. ఇక విక్రాంత్ రోణ తెలుగులో భారీ విజ‌యం సాధించడంతో, K3 మేక‌ర్స్ ఇదే క‌రెక్ట్ టైం అని భావించి సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

Kichha Sudeep : జానీ మాస్టర్‌కి స్పెషల్ కార్‌ని గిఫ్ట్ ఇచ్చిన కన్నడ స్టార్ హీరో

శివ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సుదీప్‌కు జోడీగా మ‌డోన్నా సెబాస్టియ‌స్ హీరోయిన్‌గా న‌టించింది. తెలుగులో ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్ స‌మ‌ర్పిస్తుంది. రాంబాబు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై సూర‌ప్ప బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు. మరి ఈ సినిమాతో సుదీప్ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.