Kichha Sudeep : జానీ మాస్టర్‌కి స్పెషల్ కార్ని గిఫ్ట్ ఇచ్చిన కన్నడ స్టార్ హీరో
ప్రస్తుతం జానీ మాస్టర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల జానీ మాస్టర్ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్తో కలిసి పనిచేశారు. సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' సినిమాకి.............
Kichha Sudeep : టాలీవుడ్ లో టాప్ డ్యాన్స్ మాస్టర్స్ లో ఒకరు జానీ మాస్టర్. తన కెరీర్ ఆరంభంలో డ్యాన్స్ రాదని బయటకి పంపించేస్తే ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు జానీ మాస్టర్. కేవలం టాలీవుడ్ లోనే కాక తమిళ్, కన్నడ స్టార్ హీరోల సినిమాలకు కూడా జానీ మాస్టర్ వర్క్ చేస్తున్నారు. ఇటీవల తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ సినిమాలోని పాటలకి జానీ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ బాగా వైరల్ అయింది.
ప్రస్తుతం జానీ మాస్టర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల జానీ మాస్టర్ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్తో కలిసి పనిచేశారు. సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ సినిమాకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఈ సినిమాలో జానీ పనితనం నచ్చి సుదీప్ స్పెషల్ కార్ని జానీ మాస్టర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ విషయాన్నీ జానీ మాస్టర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.
NTR : డబల్ హ్యాట్రిక్‌తో సరికొత్త రికార్డు సాధించిన ఎన్టీఆర్
తనకి ఇచ్చిన కార్ వద్ద సుదీప్తో కలిసి ఫోటో దిగిన జానీ మాస్టర్ ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోని షేర్ చేస్తూ.. ”ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు సుదీప్ సర్కి, వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదాలు. మీరు నన్ను ట్రీట్ చేసిన విధానం, నన్ను చూసుకున్న విధానం నాకు బ్లెస్సింగ్స్ లాంటిది. నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తాను. మీరు నా జీవితంలో ఉండటం నా అదృష్టం” అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ కార్ మహీంద్రా కంపెనీకి చెందిన థార్ మోడల్. ఇది జీప్ తరహాలో ఉంటుంది. దీని ధర సుమారు 15 లక్షలు ఉంటుంది. ఈ రేంజ్ కార్ని సుదీప్ జానీ మాస్టర్‌కి గిఫ్ట్ ఇచ్చారంటే ఆయన పనితనం బాగా నచ్చి ఉంటుంది అని అంటున్నారు నెటిజన్లు. ఇక సుదీప్‌ని కూడా పొగుడుతున్నారు.