Kichha Sudeep : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ.. విరాట్ కోహ్లీ ఫామ్ లాంటిది..

తాజాగా కన్నడ హీరో కిచ్చ సుదీప్ హీరోగా విక్రాంత్ రోనా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నాడు. విక్రాంత్ రోనా సినిమా బాలీవుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం ముంబైలో జరగగా........

Kichha Sudeep : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ.. విరాట్ కోహ్లీ ఫామ్ లాంటిది..

Kichha Sudeep

Bollywood :  ఇటీవల కొన్ని నెలలుగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఒక దశలో బాలీవుడ్ పరిశ్రమని డామినేట్ కూడా చేశాయి. దీంతో ఎక్కడికెళ్లినా సౌత్, బాలీవుడ్ సినీ పరిశ్రమల గురించే చర్చ. ఇక బాలీవుడ్ వాళ్ళని, సౌత్ యాక్టర్స్ బాలీవుడ్ వెళ్తే అక్కడి మీడియా దీని గురించే ప్రశ్నలు సంధిస్తోంది. బాలీవుడ్ స్టార్లు సౌత్ సినిమాల్లో నటించడానికి, ఇక్కడి వాళ్ళతో కలిసి ఆసక్తి చూపిస్తున్నారు. సౌత్ సినిమాలు కూడా హిందీలో రిలీజ్ చేసి అక్కడ కూడా భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

తాజాగా కన్నడ హీరో కిచ్చ సుదీప్ హీరోగా విక్రాంత్ రోనా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నాడు. విక్రాంత్ రోనా సినిమా బాలీవుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం ముంబైలో జరగగా దీనికి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ లో మీడియాతో మాట్లాడగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. ఒక సినీ జర్నలిస్ట్ కిచ్చ సుదీప్ ని సౌత్ సినిమాలు ఇటీవల బాలీవుడ్ కి వస్తున్నాయి, ఇక్కడ డామినేట్ చేస్తున్నారు అని అనిపిస్తుందా? అని అడిగాడు.

Kalyan Ram : అన్న కోసం తమ్ముడు.. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్..

దీనికి కిచ్చ సుదీప్ మాట్లాడుతూ.. ”మేము మా సినిమా పరిధిని పెంచుకుంటున్నాము అంతే. అన్ని ఇండస్ట్రీల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంది. అందరూ రిలీజ్ చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వదు. ఒకసారి విజయాలు వస్తాయి, ఇంకోసారి పరాజయాలు వస్తాయి. బాలీవుడ్ లో ఇప్పుడు హిట్స్ లేవని మేము డామినేట్ చెయ్యట్లేదు. గతంలో బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన పరిశ్రమని తక్కువ అంచనా వేయలేము. బాలీవుడ్ సినీ పరిశ్రమ విరాట్ కోహ్లీ ఫామ్ లాంటిది. ఇప్పుడు ఫామ్ లో లేదని గత రికార్డులు మర్చిపోతామా? మళ్ళీ ఫామ్ లోకి రాకుండా ఉంటాడా? బాలీవుడ్ కూడా అంతే. మేము ఇక్కడికి సపోర్ట్ కోసం వచ్చాం. వాళ్ళు కూడా మా దగ్గరకి వస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తాం” అని అన్నారు.

దీనిపై సల్మాన్ మాట్లాడుతూ.. ప్రతి సినిమా హిట్ అవ్వాల్సిన పనేం లేదు. కొన్ని హిట్స్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. సౌత్ కి, మాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఇప్పుడు చాలా సౌత్ సినిమాల్లో చేస్తున్నాను, వాళ్ళు బాలీవుడ్ లో చేస్తున్నారు. సౌత్ వాళ్ళతో కలిసి పని చేస్తున్నాను. గతంలో కూడా సౌత్ సినిమాలు బాలీవుడ్ కి వచ్చాయి, ఇప్పుడూ వస్తున్నాయి” అని అన్నారు.