Kalyan Ram : అన్న కోసం తమ్ముడు.. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్..

జూలై 29వ తేదీ సాయంత్రం బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ రానున్నారు. దీంతో మరోసారి నందమూరి అన్నదమ్ములు ఒకే వేదికపై.........

Kalyan Ram : అన్న కోసం తమ్ముడు.. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్..

Ntr

Updated On : July 26, 2022 / 12:40 PM IST

NTR :  నందమూరి కల్యాణ్ రామ్ ఇటీవల కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ‘బింబిసార’ అనే సినిమాతో రాబోతున్నారు కళ్యాణ్ రామ్. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా కరోనా వల్ల చాలా డిలే అయింది. మొత్తానికి సినిమా పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపిస్తున్నారు.

ఇటీవలే బింబిసార సినిమా ట్రైలర్, కొన్ని పాటలని కూడా విడుదల చేశారు. టైం ట్రావెల్ కాన్సెప్టుతో రెండు వేరు వేరు గెటప్పులతో కళ్యాణ్ రామ్ అలరించబోతున్నాడు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకి పార్ట్ 2, 3 కూడా ఉన్నాయని ఇప్పటికే ప్రకటించారు. బింబిసార సినిమాని ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాకి సంబంధించి హాట్ న్యూస్ వైరల్ గా మారింది.

Rashmika Mandanna: బాలీవుడ్ లో బిజీ అవుతున్న రష్మిక.. జెండా పాతేస్తుందా..

జూలై 29వ తేదీ సాయంత్రం బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ రానున్నారు. దీంతో మరోసారి నందమూరి అన్నదమ్ములు ఒకే వేదికపై కనబడనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.

View this post on Instagram

A post shared by NTR Arts (@ntrartsoffl)