Sudheer Babu : నాన్న సినిమాకు తనయుడి డబ్బింగ్..? కొడుకుతో కలిసి డబ్బింగ్ స్టూడియోలో సుధీర్ బాబు..

తాజాగా సుధీర్ బాబు తన కొడుకు చరిత్ మానస్ తో కలిసి ఉన్న ఓ వీడియోని పోస్ట్ చేసాడు.

Sudheer Babu and his son Charith Manas Dubbing Video goes Viral

Sudheer Babu : సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన మా నాన్న సూపర్ హీరో సినిమా రేపు అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం సుధీర్ బాబు ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా సుధీర్ బాబు తన కొడుకు చరిత్ మానస్ తో కలిసి ఉన్న ఓ వీడియోని పోస్ట్ చేసాడు.

Also Read : Pawan kalyan : బ్యాట్ పట్టిన డిప్యూటీ సీఎం.. బాల్‌ని ఎగరేస్తూ.. ఫొటోలు చూశారా..?

సుధీర్ బాబు పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. సుధీర్ బాబు తనయుడు చరిత్ మానస్ మా నాన్న సూపర్ హీరో సినిమాకు డబ్బింగ్ చెప్తున్నట్టు ఉంది. అలాగే నాన్న సెంటిమెంట్ సినిమా కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి సినిమా చూడండి అంటూ ప్రమోట్ చేసారు. ఈ వీడియో చూసిన తర్వాత చరిత్ మానస్ ఈ సినిమాలో ఏదైనా చిన్న రోల్ ప్లే చేశాడా? లేదా డబ్బింగ్ నిజంగానే చెప్పాడా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇక చరిత్ మానస్ ఆల్రెడీ గతంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. త్వరలోనే చరిత్ కూడా హీరోగా లాంచ్ అవుతాడని సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో చరిత్ మానస్ ఫొటోలతో హడావిడి చేస్తున్నాడు. చరిత్ ని చూసి ఫ్యాన్స్ అచ్చం మేనమామ మహేష్ బాబు లాగే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.