Pawan kalyan : బ్యాట్ పట్టిన డిప్యూటీ సీఎం.. బాల్‌ని ఎగరేస్తూ.. ఫొటోలు చూశారా..?
ఏపీ ఉపముఖ్యమంత్రి తాజాగా పిఠాపురం విద్యార్థులకు పంపిణి చేయనున్న పలు క్రీడా సామగ్రిని పరిశీలించారు.

Pawan kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి తాజాగా పిఠాపురం విద్యార్థులకు పంపిణి చేయనున్న పలు క్రీడా సామగ్రిని పరిశీలించారు.
పిఠాపురం నియోజకవర్గంలోని 32 ప్రాథమిక ఉన్నత పాఠశాలాల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సాహం అందించేలా ప్రతి పాఠశాలకు రెండేసి చొప్పున క్రీడా సామాగ్రి కిట్లు అందించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
ఒక్కొక్క కిట్ దాదాపు 25 వేల రూపాయలు, మొత్తం కిట్లకు 16 లక్షల రూపాయలతో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన ఆట సామాగ్రిని పరిశీలించారు.
ఈ క్రమంలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేసినట్టు పట్టుకోవడంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. పవన్ ఫ్యాన్స్ తన ఫేవరేట్ క్రికెటర్స్ ఫొటోలతో పవన్ కళ్యాణ్ బ్యాట్ పట్టుకున్న ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అలాగే వాలీబాల్, క్యారం బోర్డ్స్, షటిల్ క్రీడా సామాగ్రిని కూడా పవన్ పరిశీలించారు. దీంతో పవన్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.