Sarkaar : ‘సర్కార్’ మళ్ళీ వచ్చేస్తున్నాడు.. మరోసారి సుడిగాలి సుధీర్ ఎంటర్టైన్మెంట్..

ఆహాలో సక్సెస్ అయిన షోలలో సర్కార్ ఒకటి. సెలబ్రిటీలతో క్విజ్ లాంటి గేమ్ కాన్సెప్ట్ తో ఈ షో నడుస్తుంది.

Sudigali Sudheer Aha Sarkaar Season 5 Promo Released

Sarkaar : ఆహా ఓటీటీలో రెగ్యులర్ గా కొత్త కొత్త షోలు, సిరీస్ లు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. షోలు సక్సెస్ అయితే వాటికి రెగ్యులర్ గా సీజన్స్ కూడా వస్తున్నాయి. ఆహాలో సక్సెస్ అయిన షోలలో సర్కార్ ఒకటి. సెలబ్రిటీలతో క్విజ్ లాంటి గేమ్ కాన్సెప్ట్ తో ఈ షో నడుస్తుంది.

సర్కార్ మొదటి మూడు సీజన్స్ ప్రదీప్ యాంకరింగ్ చేసి మెప్పించాడు. నాలుగో సీజన్ లో సుడిగాలి సుధీర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా సీజన్ 5 ని ప్రకటించారు. ఈసారి కూడా సర్కార్ సీజన్ 5 ని సుడిగాలి సుధీర్ హోస్ట్ చేయబోతున్నాడు. తాజాగా ఈ సీజన్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో సుధీర్ పెద్దిలో రామ్ చరణ్ లా డైలాగ్స్ చెప్పి మెప్పించాడు.

Also Read : Pawan Kalyan : రోజంతా షూట్ చేసి.. రాత్రికి నాలుగు గంటల్లో మొత్తం పని పూర్తిచేసిన పవన్.. అభినందించాల్సిందే..

సర్కార్ సీజన్ 5 జూన్ 6 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. జూన్ 6 సాయంత్రం 7 గంటలకు మొదటి ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రానుంది. ఈసారి కూడా సుధీర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మెప్పిస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మీరు కూడా సర్కార్ సీజన్ 5 ప్రోమో చూసేయండి..

Also Read : Gaddar Awards : తెలంగాణ గద్దర్ అవార్డుల్లో అదరగొట్టిన లక్కీ భాస్కర్, కల్కి, 35 ఇది చిన్నకథ కాదు.. ఏయే సినిమాకు ఎన్ని అవార్డులు..