Pawan Kalyan : రోజంతా షూట్ చేసి.. రాత్రికి నాలుగు గంటల్లో మొత్తం పని పూర్తిచేసిన పవన్.. అభినందించాల్సిందే..

ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తిచేయగా ఈ సినిమా జూన్ 12 రిలీజ్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Pawan Kalyan : రోజంతా షూట్ చేసి.. రాత్రికి నాలుగు గంటల్లో మొత్తం పని పూర్తిచేసిన పవన్.. అభినందించాల్సిందే..

Pawan Kalyan wraps dubbing for HariHara VeeraMallu after OG Shoot

Updated On : May 29, 2025 / 2:29 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయడానికి డేట్స్ ఇస్తున్నారు. ఇటు సినిమాలు, అటు ప్రభుత్వ పాలనతో విరామం లేకుండా పరిగెడుతున్నారు. ప్రస్తుతం పవన్ OG షూటింగ్ లో ఉన్నారు. ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తిచేయగా ఈ సినిమా జూన్ 12 రిలీజ్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు డబ్బింగ్ చెప్పారు. నిన్నంతా పవన్ OG షూట్ చేసి ఆ తర్వాత రాత్రికి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టారు. కేవలం నాలుగు గంటల్లోనే సినిమా అంతా డబ్బింగ్ పూర్తిచేసేసారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా హీరోలు డబ్బింగ్ అంటే సినిమా మొత్తానికి ఒక మూడు నాలుగు రోజులు కూడా తీసుకుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఒక రోజంతా తీసుకుంటారు డబ్బింగ్ కోసం.

Also Read : Gaddar Awards : తెలంగాణ గద్దర్ అవార్డుల్లో అదరగొట్టిన లక్కీ భాస్కర్, కల్కి, 35 ఇది చిన్నకథ కాదు.. ఏయే సినిమాకు ఎన్ని అవార్డులు..

అలాంటిది పవన్ పొద్దునంతా షూట్ చేసి రాత్రికి మళ్ళీ కంటిన్యూగా నాలుగు గంటలు డబ్బింగ్ చెప్పి సినిమా మొత్తం పూర్తి చేసాడంటే గ్రేట్ అంటున్నారు. ఇలా పవన్ పగలు రాత్రి లేకుండా కష్టపడుతుండంతో అభినందించాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు.

Also Read : Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ పండక్కి థియేటర్స్ లో సందడి..