Suhani Kalita : తూనీగా తూనీగా అని ఆడిపాడిన అమ్మాయి.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుంది..
మనందరికీ మనసంతా నువ్వే సినిమాలో 'తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..' అనే పాట బాగా గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో చిన్నప్పటి హీరోయిన్ గా నటించిన అమ్మాయి..............
Suhani Kalita : మనందరికీ మనసంతా నువ్వే సినిమాలో ‘తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..’ అనే పాట బాగా గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో చిన్నప్పటి హీరోయిన్ గా నటించిన అమ్మాయి పేరు సుహాని కలిత. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమకి పరిచయమై తర్వాత ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నటించిన సుహాని ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతుంది.
బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన సుహాని గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను.. లాంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా సినిమాలు చేసింది. సినిమాలతో పాటు పలు కంపెనీల యాడ్స్‌లోనూ నటించింది. 2008లో సవాల్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాలు హీరోయిన్ గా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది సుహాని.
Allu Aravind: ఓటీటీలపై అల్లు అరవింద్ కామెంట్స్.. ఏమన్నారంటే?
చైల్డ్ ఆర్టిస్ట్, నటి, హీరోయిన్గా మెప్పించిన సుహాని తాజాగా పెళ్లిపీటలెక్కబోతోంది. సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాను త్వరలో పెళ్లి చేసుకోండి. ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.