Suhas : వామ్మో.. మన కలర్ ఫోటో సుహాస్.. ఎలా మారిపోయాడో చూడండి.. తమిళ సినిమా కోసం..

సుహాస్ ఇప్పుడు తమిళ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

Suhas First Look Released from Tamil Movie Mandaadi

Suhas : షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి ఎదిగి కలర్ ఫోటోతో హీరోగా మరి అందర్నీ మెప్పించిన సుహాస్ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. పలు సినిమాల్లో కీలక పాత్రలు కూడా పోషిస్తున్నాడు. అయితే సుహాస్ ఇప్పుడు తమిళ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తమిళ్ స్టార్ కమెడియన్ సూరి మెయిన్ లీడ్ నటిస్తున్న మండాడి సినిమాలో సుహాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా మండాడి తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మహిమా నంబియార్, నటిస్తుండగా సత్యరాజ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవల టైటిల్, సూరి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా తాజాగా సుహాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

Also Read : Tanmay : తిన్నది అరగక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.. నాకు 5 లక్షలు ఇస్తా అన్నారు.. బెట్టింగ్ యాప్స్ పై తన్మయి కామెంట్స్..

లుంగీ ధరించి, నెరిసిన జుట్టుతో, సునామీ రైడర్స్ అనే జెర్సీ వేసుకొని సముద్రతీరంలో నిల్చున్నాడు. ఈ పోస్టర్ చూస్తే అసలు ఇది మన సుహాసేనా అని డౌట్ రావడం ఖాయం. మరో పోస్టర్ లో సూరి, సుహాస్ ఇద్దరూ స్వయంగా పడవలు నడుపుతూ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా కనిపించడంతో సినిమాలో వాళ్ళిద్దరి మధ్య గట్టి పోరు ఉండబోతుందని తెలుస్తుంది.

తమిళ సినిమా కోసం సుహాస్ ఈ రేంజ్ లో మారిపోయాడు అని ఆశ్చర్యపోతున్నారు. తన నటనతో ఆల్రెడీ ఇక్కడ మెప్పించాడు కాబట్టి ఈ సినిమాతో తమిళ్ లో కూడా సుహాస్ బిజీ అయిపోతాడని అంటున్నారు.

Also Read : Jabardasth Tanmay : మా నాన్న చనిపోయినప్పుడు.. జబర్దస్త్ లో అతనొక్కడే సపోర్ట్ చేసాడు..