Tanmay : తిన్నది అరగక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.. నాకు 5 లక్షలు ఇస్తా అన్నారు.. బెట్టింగ్ యాప్స్ పై తన్మయి కామెంట్స్..
జబర్దస్త్ తన్మయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి మాట్లాడింది.

Jabardasth Tanmay Sensational Comments on Betting Apps and Promoters
Jabardasth Tanmay : ఇటీవల బెట్టింగ్ యాప్స్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకొని ఎంతోమంది నష్టపోతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుండటంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయాన్ని. అనేకమంది టీవీ, సోషల్ మీడియా, సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో పోలీసులు వారిపై ఫోకస్ పెట్టారు.
ఈ క్రమంలో జబర్దస్త్ తన్మయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి మాట్లాడింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నీకు వచ్చాయా, నువ్వెందుకు చేయలేదు అని అడిగారు.
Also Read : Jabardasth Tanmay : మా నాన్న చనిపోయినప్పుడు.. జబర్దస్త్ లో అతనొక్కడే సపోర్ట్ చేసాడు..
తన్మయి సమాధానమిస్తూ.. నాకు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయమని వచ్చాయి. కానీ చేయలేదు. నాకు 5 లక్షలు ఇస్తా అన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే. తిన్నది అరగక కొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది లైఫ్ లు పోయాయి. ఆ టైంకి మనకు డబ్బు వస్తుందని చూసుకుంటున్నారు. ఆ డబ్బులతో ఎన్ని రోజులు తింటారు. అవి ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటివి చేయడం కంటే అడుక్కు తినడం బెటర్. డబ్బుకు కక్రుత్తి పడి చేస్తే వేరే వాళ్ళ ప్రాణాలు పోతాయి. డబ్బు కోసం ప్రమోట్ చేస్తే అంతకంటే దరిద్రులు ఉండరు. అందుకే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, చేయను అని క్లారిటీ ఇచ్చింది.