Jabardasth Tanmay : 8 ఏళ్ళు లవ్ చేశాను.. అతను, వాళ్ళ ఫ్యామిలీ మోసం చేసారు.. జబర్దస్త్ తన్మయి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ..
తన లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా చెప్పుకొచ్చింది తన్మయి.

Jabardasth Tanmay Tells about her Love Failure Story
Jabardasth Tanmay : జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో పరిచయం అయిన తన్మయి ఆ తర్వాత అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది. జబర్దస్త్ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది తన్మయి. అప్పుడప్పుడు పలు టీవీ షోలలో కనిపిస్తుంది. తాజాగా తన్మయి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తన లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా చెప్పుకొచ్చింది.
తన్మయి మాట్లాడుతూ.. ఒక అబ్బాయిని 8 ఏళ్ళు లవ్ చేశాను. నేను సంపాదించే డబ్బులతో నా ఫ్యామిలీని చూసుకోవడమే కాక అతనికి కూడా ఇచ్చాను. అతని ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేశాను. అతను కూడా నన్ను లవ్ చేసాడు. గుంటూరులో మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. కానీ తర్వాత తెలిసింది వాళ్ళు నన్ను లవ్ చేయలేదు. నా డబ్బుని లవ్ చేసారు అని. నన్ను చాలా మోసం చేసారు. అప్పట్నుంచే లవ్, రిలేషన్ ఇంకేమి వద్దు అనుకున్నాను. నాకు పెళ్లి చేసుకుంటాను అని సంబంధాలు కూడా వచ్చాయి. కానీ నేనే వద్దని చెప్పాను అని తెలిపింది.