Jabardasth Tanmay : మా నాన్న చనిపోయినప్పుడు.. జబర్దస్త్ లో అతనొక్కడే సపోర్ట్ చేసాడు..

తన తండ్రి మరణించినప్పుడు తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని ఒక్కరే సపోర్ట్ చేసారని తెలిపింది తన్మయి.

Jabardasth Tanmay : మా నాన్న చనిపోయినప్పుడు.. జబర్దస్త్ లో అతనొక్కడే సపోర్ట్ చేసాడు..

Jabardasth Tanmayi Tells about Nukaraju Support when her Father Passed away Time

Updated On : May 5, 2025 / 5:30 PM IST

Jabardasth Tanmay : జబర్దస్త్ తన్మయి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ కష్టాలు, జబర్దస్త్ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన తండ్రి మరణించినప్పుడు తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని ఒక్కరే సపోర్ట్ చేసారని తెలిపింది.

తన్మయి మాట్లాడుతూ.. ముందు రోజు షూటింగ్ చేసుకొని రాత్రి ఇంటికి వచ్చి నాన్నతో వీడియో కాల్ మాట్లాడాను. నెక్స్ట్ డే ఉదయం 11 గంటలకు నాన్న చనిపోయాడు అని వార్త వచ్చింది. నాకు ఏం చేయాలో తెలియలేదు. ఏడుపు వచ్చేసింది. కాళ్ళు చేతులు ఆడలేదు. నేను విజయవాడ వెళ్ళాలి. కొంతమందికి ఫోన్స్ చేశాను వాళ్లకు కుదర్లేదు. ఇమ్మాన్యుయేల్ కి షూట్ ఉంది లేకపోతే వచ్చేవాడు. నూకరాజు వచ్చాడు. అతని పనులు, షూటింగ్ అన్ని వదులుకొని నా కోసం వచ్చాడు. కార్ తీసుకొని వచ్చి నన్ను విజయవాడకు తీసుకెళ్లాడు. నన్ను ఓదారుస్తూ, నాకు దైర్యం చెప్తూ నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చాడు. నాకు ఆ సమయంలో జబర్దస్త్ లో ఇంకెవరూ సపోర్ట్ చేయలేదు. నూకరాజు ఒక్కడే సపోర్ట్ చేసాడు అని తెలిపింది.

Also Read : Jabardasth Tanmay : 8 ఏళ్ళు లవ్ చేశాను.. అతను, వాళ్ళ ఫ్యామిలీ మోసం చేసారు.. జబర్దస్త్ తన్మయి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ..

ఇప్పుడు నాకు ఉన్న ఫ్రెండ్స్ నూకరాజు, ఇమ్మాన్యుయేల్ ఇద్దరే. నన్ను అక్కా అని పిలుస్తారు. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోను కానీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అని తెలిపింది తన్మయి. పటాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న నూకరాజు ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలు, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Jabardasth Tanmay (@jabardasth_tanmay)