Suhas : మూడు రోజుల్లో రిలీజ్ పెట్టుకొని తన సినిమాని పట్టించుకోని సుహాస్.. ఏం జరిగింది..?

సుహాస్ ఈ మధ్య కొన్ని సినిమాలని ప్రమోట్ చెయ్యట్లేదు.

Suhas : మూడు రోజుల్లో రిలీజ్ పెట్టుకొని తన సినిమాని పట్టించుకోని సుహాస్.. ఏం జరిగింది..?

Suhas Not Promoting His Film Gorre Puranam What Happened

Updated On : September 17, 2024 / 8:24 AM IST

Suhas : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన సుహాస్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా మారాడు. కలర్ ఫోటోతో మెప్పించిన సుహాస్ ఆ తర్వాత హీరోగా వరుస సక్సెస్ లు కొడుతున్నాడు. సుహాస్ హీరోగా ఇప్పటివరకు రిలీజయిన నాలుగు సినిమాలు ప్రేక్షకులని మెప్పించి హిట్ అయ్యాయి. అయితే సుహాస్ ఈ మధ్య కొన్ని సినిమాలని ప్రమోట్ చెయ్యట్లేదు.

ఇటీవల సుహాస్ ముఖ్య పాత్రలో నటించిన ఓ ఆంథాలజీ జానర్ సినిమా శ్రీరంగ నీతులు ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. ఇప్పుడు సుహాస్ మెయిన్ లీడ్ చేసిన గొర్రె పురాణం సినిమాని పట్టించుకోవట్లేదు. గొర్రె పురాణం సినిమా సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ కి మూడు రోజులే ఉన్నా ఇప్పటి వరకు సుహాస్ గొర్రె పురాణం సినిమా గురించి ఒక్క ట్వీట్ కానీ, పోస్ట్ కానీ పెట్టలేదు. ఆ సినిమా ప్రమోషన్స్ కూడా చెయ్యట్లేదు.

Also Read : Suriya – Karthi – Rajamouli : సూర్య, కార్తీలతో రాజమౌళి సినిమా ప్లాన్.. కానీ.. కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు..

గతంలో ఆ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు, పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం షేర్ చేసిన సుహాస్ ఇప్పుడు ఆ సినిమాని ఎందుకు పట్టించుకోవట్లేదు అని అతని ఫ్యాన్స్, టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. సినిమా సరిగ్గా రాలేదా? లేక రెమ్యునరేషన్ విషయంలో ఏమైనా అభిప్రాయ బేధాలు వచ్చాయా? మూవీ టీమ్ తో ఏదైనా గొడవ అయిందా? లేక సినిమాలో సుహాస్ హీరోనా కాదా? అని టాలీవుడ్ లోను, ఫ్యాన్స్ లోను చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది అయితే సుహాస్ మెయిన్ హీరోగా చేసిన సినిమాలనే ప్రమోట్ చేస్తున్నాడు. ఇవన్నీ స్టార్ అవ్వకముందు ఒప్పుకున్న సినిమాలు, అందుకే ప్రమోట్ చెయ్యట్లేదు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి సుహాస్ ఈ గొర్రె పురాణం సినిమాని ఎందుకు పట్టించుకోవట్లేదో అతనికి, సినిమా టీమ్ కే తెలియాలి.