Suhas : తమిళ్లో భారీ బడ్జెట్ తో.. సుహాస్ విలన్ గా చేసిన సినిమా.. రిలీజ్ డేట్ అనౌన్స్..
సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నారు. (Suhas)
Suhas
Suhas : మన తెలుగు హీరో సుహాస్ ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క విలన్ గా, కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సుహాస్ ఇప్పుడు తమిళ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
సుహాస్, తమిళ్ స్టార్ కమెడియన్ సూరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘మండాడి’. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో రియల్ సముద్రంలో యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సీక్వెన్స్ లతో ఈ సినిమాని దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.
Also Read : Makutam Teaser : విశాల్ ‘మకుటం’ టీజర్ వచ్చేసింది.. మూడు వేరియేషన్స్‌తో అదరగొట్టాడుగా..
సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మండాడి సినిమాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మాణంలో మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. మండాడి సినిమా సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించగా సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్.. పలువురు కీలక పాత్రలను పోషించారు.

Also Read : Isakapatnam : ఓటీటీలో ఐశ్వర్య రాజేష్ కొత్త సిరీస్.. ఇసాకపట్నం ఎప్పుడో తెలుసా?
