Sriranga Neethulu : ఆహాలో దూసుకుపోతున్న సుహాస్ ‘శ్రీరంగనీతులు’.. మూడు కథలతో..

తెలుగు ఓటీటీ ఆహాలో శ్రీరంగనీతులు సినిమా దూసుకుపోతుంది.

Suhas Sriranga Neethulu Movie Streaming in Aha OTT and Getting Good Views

Sriranga Neethulu : సుహాస్‌(Suhas), రుహానీశర్మ, విరాజ్‌ అశ్విన్‌, కార్తీక్‌రత్నం మెయిన్ లీడ్స్ లో ప్రవీణ్‌కుమార్‌ దర్శకత్వంలో వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘శ్రీరంగనీతులు’. ఈ సినిమా ఏప్రిల్‌ 11న థియేటర్స్ లో విడుదల అయింది. తాజాగా మే 29 నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ లో కూడా శ్రీరంగనీతులు సినిమా స్ట్రీమ్ అవుతుంది.

అయితే తెలుగు ఓటీటీ ఆహాలో శ్రీరంగనీతులు సినిమా దూసుకుపోతుంది. సుహాస్ వరుసగా తన సినిమాలతో మెప్పించి హిట్స్ కొడుతున్నాడు. ఆహాలో వచ్చిన కలర్ ఫోటో సినిమాతోనే సుహాస్ కి స్టార్ డమ్ వచ్చింది. అప్పట్నుంచి ఆహాలో సుహాస్ ప్రతి సినిమా మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటుంది. తాజాగా శ్రీరంగనీతులు కూడా ఆహాలో మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.

Also Read : Kalki 2898 AD trailer : ప్రభాస్ ‘కల్కి 2898AD’ ట్రైల‌ర్ డేట్ ఫిక్స్ అయిందా??

ఇక కథ విషయానికొస్తే.. మూడు కథలతో ఆంథాలజీ జానర్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఓ కథలో.. శివ(సుహాస్) ఓ బస్తిలో ఉంటూ జాబ్ చేస్తూ ఉంటాడు. బస్తీలో కుర్రాళ్ళ మధ్య గొప్పగా ఉండాలని ఫ్లెక్సీల పిచ్చితో ఆ ఏరియా రాజకీయ నాయకుడితో ఫొటో దిగి గ్రౌండ్ లో పెద్ద ఫ్లెక్సీ వేయిస్తాడు. తెల్లారేసరికి ఆ ఫ్లెక్సీ ఉండదు. దీంతో ఆ ఫ్లెక్సీ కోసం గొడవతో సాగుతుంది. ఇక ఇంకో కథలో.. ఇందు(రుహాణి శర్మ) వరుణ్(విరాజ్ అశ్విన్) ప్రేమించుకుంటారు. కానీ ఇందు తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది. మూడో కథలో.. కార్తీక్(కార్తీక్ రత్నం) లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని మందు, సిగరెట్, గంజాయికి అలవాటు పడతాడు. గంజాయి మొక్కలు పోలీసులకు కనపడి కార్తీక్ కోసం వెళ్తే పోలీసుల భయంతో కార్తీక్ ఆ గంజాయి మొక్కలను తీసుకొని పారిపోతాడు. కార్తీక్ తండ్రి అతన్ని ఎలాగైనా బాగుచేయాలని ట్రై చేస్తాడు. మరి ఈ మూడు కథలకు ఏమైనా సంబంధం ఉందా? అనేది ఆహా ఓటీటీలో చూసేయండి.