Mandaadi Teaser : ‘మండాడి’ టీజర్ రిలీజ్.. సముద్రంలో పడవల పోటీ.. అదిరిందిగా..
మీరు కూడా మండాడి టీజర్ చూసేయండి..( Mandaadi Teaser)
Mandaadi Teaser
Mandaadi Teaser : తమిళ కమెడియన్ సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్ విలన్ గా తెరకెక్కుతున్న సినిమా మండాడి. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ మండాడి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించగా సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
మండాడి సినిమా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ్ తో పాటు మలయాళం, కన్నడ, హిందీలో కూడా రిలీజ్ కానుంది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ చూస్తుంటే.. సముద్రపు ఒడ్డున ఉండే జాలర్లు, వల్ల మధ్య ఉండే గొడవలు, సముద్రంలో పడవల పోటీతో ఆసక్తిగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : GV Narayana Rao : చిరంజీవి, రజినీకాంత్ క్లోజ్ ఫ్రెండ్.. సీనియర్ నటుడు కన్నమూత..
మీరు కూడా మండాడి టీజర్ చూసేయండి..
