×
Ad

Suhasini : చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో బెస్ట్ మూమెంట్స్.. లైఫ్ లో మర్చిపోలేను.. సుహాసిని కామెంట్స్..

సుహాసిని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(Suhasini)

Suhasini

Suhasini : చంటిగాడు సినిమాతో 15 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాసిని ఆ తర్వాత పలు సినిమాలు చేసి సీరియల్స్ లో బిజీ అయింది. సీరియల్స్ లో మంచి స్టార్ డమ్ తెచ్చుకుంది సుహాసిని. ప్రస్తుతం సీరియల్స్, టీవీ షోలతో నటిగా, నిర్మాతగా బిజీగానే ఉంది. తాజాగా సుహాసిని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(Suhasini)

సుహాసిని చిరంజీవి గురించి మాట్లాడుతూ.. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఆయన డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ చూస్తూ పెరిగాను. సినిమాల్లోకి వచ్చాక మూడు నాలుగు సార్లు కలిసాను. ఫస్ట్ టైం నా మొదటి సినిమా చంటిగాడు తర్వాత ఒకసారి కలిసాను. ఆ తర్వాత ఓ మూడు నాలుగేళ్లకు చంటిగాడు డైరెక్టర్ జయ కొత్త సినిమా ఓపెనింగ్ కి పిలిచారు. దానికి చిరంజీవి కూడా వచ్చారు. జయ నన్ను తీసుకెళ్లి చిరంజీవికి చంటిగాడు హీరోయిన్ అని చెప్తుంటే ఆ తెలుసు సుహాసిని అని నా పేరు చెప్పి బాగున్నావమ్మా అని అడిగారు. అసలు ఆయన నన్ను గుర్తుపెట్టుకొని, నా పేరు గుర్తుపెట్టుకొని పిలిచారు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది అని తెలిపింది.

Also Read : Child Artist Khushi : పాపం రియల్ లైఫ్ లో తండ్రి లేడు.. సినిమాలో చిరంజీవి కూతురుగా.. చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్..

అలాగే పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ.. 75 ఏళ్ళు సినిమా వజ్రోత్సవాలలో నేను సావిత్రి గారి సాంగ్ పెర్ఫార్మ్ చేశాను. ఆ ఈవెంట్ అయ్యాక ఇంకో చిన్న ఈవెంట్లో 75 వజ్రోత్సవాలలో పెర్ఫార్మ్ చేసిన వాళ్లకు పవన్ కళ్యాణ్ గారితో స్పెషల్ మెమెంటోస్ ఇప్పించారు. నాకు కూడా ఇచ్చారు. నాకు ఆయనతో ఫోటో దిగాలని ఉంది కానీ అడగలేకపోయాను. ఈవెంట్ అయ్యాక వెళ్లిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తూ నా వెనకాలే ఉన్నారు. ఆయనే ఎక్స్ క్యూజ్ మీ అని పిలిచి.. మీరు సావిత్రి గారి సాంగ్ చేసారు కదా బాగా చేసారు అని అభినందించారు. చాలు ఈ మాట చాలు అనిపించింది. ఈ రెండు నాకు స్పెషల్ మూమెంట్స్ లైఫ్ లో మర్చిపోలేను అని తెలిపింది సుహాసిని.

Also See : Varsha Bollamma : చీరకట్టులో కానిస్టేబుల్ కనకం.. వర్ష బొల్లమ్మ ఫొటోలు..