Child Artist Khushi : పాపం రియల్ లైఫ్ లో తండ్రి లేడు.. సినిమాలో చిరంజీవి కూతురుగా.. చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్..
సినిమా సక్సెస్ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. (Child Artist Khushi)
Child Artist Khushi
Child Artist Khushi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. ఈ సినిమాలో చిరంజీవి ఇద్దరి పిల్లల తండ్రిగా నటించారు. చిరంజీవి కూతురిగా ఖుషి సోని అనే పాప నటించగా చిరంజీవి కొడుకుగా ఊహ అనే పాప నటించింది. ఈ ఇద్దరూ కూడా చిరంజీవి, నయనతార.. మిగతా ఆర్టిస్టులతో బాగా నటించి మెప్పించారు.(Child Artist Khushi)
ఖుషి సినిమాలో ఎమోషన్ సీన్స్ లో కూడా మెప్పించింది. సినిమా సక్సెస్ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలు తనకు నాన్న లేరని, చిరంజీవిని నాన్న అని పిలిచినప్పుడు ఎమోషనల్ అయినట్టు ఆ విషయాలు చెప్పుకొచ్చింది.
Also See : Sukriti Veni : సుకుమార్ కూతురు, నేషనల్ అవార్డు విన్నర్ సుకృతి వేణి బర్త్ డే.. స్పెషల్ ఫొటోలు..
చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి మాట్లాడుతూ.. నాకు నాన్న లేరు. మాది రాజస్థాన్. రెండేళ్ల క్రితం హైదరాబాద్ కి వచ్చాము. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. మా ఇద్దర్ని మా అమ్మే చూసుకుంటుంది. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ కూడా నేను చదివే స్కూల్ లోనే పనిచేస్తుంది. చిరంజీవి కూతురిగా నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ లో చిరంజీవిని నాన్న అని పిలిచినప్పుడు ఒక్కోసారి ఎమోషనల్ అయ్యేదాన్ని. ఏడుపు కూడా వచ్చేది. నాకు కూడా అలాంటి నాన్న ఉంటే బాగుండేది అనిపిస్తుంది. చిరు సర్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మాకు కేక్స్, చాక్లెట్స్ ఇచ్చారు. చిరంజీవితో ఇంకోసారి నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా అని తెలిపింది.
అయితే తన తండ్రి లేరు అని చెప్పింది కానీ అంతకుమించి ఎలాంటి వివరాలు తన తండ్రి గురించి చెప్పడానికి ఇష్టపడలేదు ఖుషి. దీంతో పాపం అని అంటున్నారు నెటిజన్లు. రియల్ లైఫ్ లో తండ్రి లేకపోయినా సినిమాలో తండ్రి కూతురు బాండింగ్ ని చాలా బాగా పండించింది, ఎమోషనల్ సీన్స్ లో మెప్పించింది అని ఖుషిని అభినందిస్తున్నారు.

Also Read : Nidhhi Agerwal : పెళ్ళికి ముందే పిల్లలు కావాలి అనుకున్నా.. కానీ.. రాజాసాబ్ భామ కామెంట్స్ వైరల్..
