×
Ad

Sujeeth : సుజీత్ కి గుడి కట్టినా తప్పు లేదు.. ఫుల్ హ్యాపీలో పవన్ ఫ్యాన్స్..

OG సినిమా చూసిన తర్వాత పవన్ ఫ్యాన్స్ సుజీత్ కి గుడి కట్టిన తప్పు లేదు అంటున్నారు. (Sujeeth)

Sujeeth

Sujeeth : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న OG సినిమా. నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచే కలెక్షన్స్ అదరగొడుతున్నాయి. ఈ మధ్య కాలంలో OG సినిమాకు వచ్చినంత హైప్ దేనికి రాలేదు. ఇందుకు కారణం డైరెక్టర్ సుజీత్.(Sujeeth)

ఇక సినిమా చూసిన తర్వాత పవన్ ఫ్యాన్స్ సుజీత్ కి గుడి కట్టిన తప్పు లేదు అంటున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం ఫ్యాన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చింది. గ్యాంగ్ స్టర్ లుక్స్ లో స్టైలిష్ గా కనిపించాడు పవన్. కాస్ట్యూమ్స్ మీద స్పెషల్ కేర్ తీసుకున్నాడు సుజీత్. ఇక రాజకీయాల వల్ల పవన్ తన లుక్స్ ని పట్టించుకోలేదు. అయినా ఎలాంటి వేరియేషన్స్ కనిపించకుండా, హరిహర వీరమల్లులో జరిగిన తప్పు జరగకుండా చాలా జాగ్రత్త పడ్డాడు సుజీత్.

Also Read : They Call Him OG : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..

ఎలివేషన్స్ సంగతి చెప్పనవసరం లేదు. ప్రతీ సీన్ లో పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్స్ ఇచ్చారు. పవన్ లేని సీన్స్ లో కూడా డైలాగ్స్ తో ఎలివేషన్స్ ఇచ్చి మంచి హై ఫీల్ ఇచ్చారు. ఇక టైటిల్ కార్డు, సీక్వెల్ టైటిల్ కార్డు సరికొత్తగా చూపించి మెప్పించాడు. ఇలా సినిమా అంతా పద్దతిగా చెక్కాడు సుజీత్. పాపం పవన్ రాజకీయాల బిజీ వల్ల డేట్స్ అప్పుడప్పుడు ఇచ్చినా సుజీత్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి తీసుకున్నాడు.

దీంతో పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయినా ఆనందంలో సుజీత్ వల్లే అని అర్ధం చేసుకొని సుజీత్ ని నెత్తిన పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. కొంతమంది ఫ్యాన్స్ అయితే పవన్ ని మాకు కావాల్సిన విధంగా చూపించినందుకు థ్యాంక్స్ అంటూ సుజీత్ కి గుడి కట్టినా తప్పులేదు అంటున్నారు. ఇక సుజీత్ కూడా పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్ అని తెలిసిందే. అందుకే ఒక అభిమాని తన ఫేవరేట్ హీరోని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా తీసాడు అని అంటున్నారు ప్రేక్షకులు. మొత్తానికి సుజీత్ డైరెక్షన్ తో పవన్ ఫ్యాన్స్, జనసైనికులు ఫుల్ హ్యాపీ.

Also Read : Neha Shetty : OGలో నేహశెట్టి స్పెషల్ సాంగ్ ఏది బ్రో..? ఎడిటింగ్ లో తీసేశారా?