×
Ad

OG 2 : ఓజీ సీక్వెల్ కాదా? ప్రీక్వెల్..? సుభాష్ చంద్రబోస్ తో లింక్.. OG పార్ట్ 2 కథ ఇదే..

OG సక్సెస్ తర్వాత డైరెక్టర్ సుజీత్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో OG పార్ట్ 2 కథ గురించి చెప్పాడు. (OG 2)

OG 2

OG 2 : పవన్ కళ్యాణ్ OG సినిమా పెద్ద హిట్ అయి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు 154 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ గా నిలిచింది OG సినిమా. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించారు. దీంతో పార్ట్ 2 ఎప్పుడు ఉంటుంది? ఎలా ఉంటుంది అని పెద్ద చర్చే జరుగుతుంది.(OG 2)

OG సక్సెస్ తర్వాత డైరెక్టర్ సుజీత్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో OG పార్ట్ 2 కథ గురించి చెప్పాడు. సుజీత్ చెప్పిన దాని ప్రకారం.. సుభాష్ చంద్రబోస్ జపాన్ వెళ్ళినప్పుడు కొంతమంది ఇండియన్ ఆర్మీ కూడా తీసుకెళ్లాడు. వాళ్ళల్లో ఒకరు అక్కడ సమురాయ్ లకు సపోర్ట్ చేసి చనిపోతారు. అతని కొడుకు ఓజాస్ గంభీర(పవన్ కళ్యాణ్). OG సినిమా ఓపెనింగ్ లోనే ఓజాస్ గంభీర తండ్రి సమురాయ్ లకు సపోర్ట్ చేసి చనిపోయాడని చెప్పారు. దీంతో ఇదంతా OG సినిమాకు ముందు జరిగే కథే.

Also Read : OG Collections : పవర్ స్టార్ OG ఫస్ట్ డే కలెక్షన్స్.. అఫీషియల్ అనౌన్స్.. ఇది కదా పవన్ కళ్యాణ్ రేంజ్..

అలాగే OG సినిమాలో ముంబై నుంచి వెళ్ళిపోయాక ఓ ఏడేళ్లు కన్మణి దగ్గర ఉంటాడు. ఇంకో 8 ఏళ్ళు ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికి తెలియదు. చివర్లో జపాన్ లో పెద్ద గ్యాంగ్ స్టార్ అని, యుజికిలందర్నీ చంపేశాడని చూపించారు. అలాగే అతని పేరు ఓరోచి జెన్షిన్ అని చూపించి, అతను చనిపోయాడని జపాన్ లో అందరూ నమ్ముతున్నారు అని ఒక సీన్ లో చూపించారు.

దీంతో జపాన్ లో ఓజాస్ గంభీర ఓరోచి జెన్షిన్ లా ఎలా మారాడు, అక్కడ యుజికీలను ఎలా అంతం చేసాడు అని ఉంటుంది. ఈ రెండు కూడా OG సినిమా కథకు ముందు జరిగేవే. దీంతో OG సినిమాకు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ఉంటుందని టాక్ నడుస్తుంది. అలాగే OG క్లైమాక్స్ లో మిగిలిన డేవిడ్ భాయ్, యుజికి లీడర్.. గంభీరను చంపడానికి వస్తారని పార్ట్ 2 చివర్లో అది ఉండొచ్చని తెలుస్తుంది. ఈ కథంతా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కి చెప్పానని, పవన్ ఓకే చెప్పి మళ్ళీ డేట్స్ ఇస్తే అవుతుంది అని అన్నాడు సుజీత్.

Also See : OG Working Stills : పవన్ కళ్యాణ్ OG సినిమా వర్కింగ్ స్టిల్స్ చూశారా..?