Pushpa 2 : నేషనల్ అవార్డుతో సీక్వెల్ పై మరింత అంచనాలు.. రిలీజ్‌ కోసం ఆ డేట్ ఫిక్స్ చేశారట..!

పుష్ప-1కు గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడంతో సీక్వెల్ కి మరింత క్రేజ్ ఏర్పడింది. దీంతో అభిమానుల అంచనాలు అందుకోవడానికి సుకుమార్..

Pushpa 2 : నేషనల్ అవార్డుతో సీక్వెల్ పై మరింత అంచనాలు.. రిలీజ్‌ కోసం ఆ డేట్ ఫిక్స్ చేశారట..!

Sukumar Allu Arjun Devi Sri Prasad Rashmika Mandanna Pushpa 2 release date

Updated On : August 25, 2023 / 2:46 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కలయికలో వచ్చిన ‘పుష్ప-1’ (Pushpa 1) బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ , డైలాగ్స్ అండ్ డాన్స్ స్టెప్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నాయి. పార్ట్-1 రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్లు పూర్తి అవ్వుతున్నాయి. కానీ సెకండ్ పార్ట్ మాత్రం ఇంకా ప్రొడక్షన్ దశలోనే ఉంది. మొదటి భాగంతో వచ్చిన హైప్ ని అందుకునేలా సుకుమార్ రెండో భాగాన్ని తెరకెక్కిస్తుండడంతోనే మూవీ రిలీజ్ లేట్ అవుతూ వస్తుంది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ OG సెట్స్ నుంచి వీడియో లీక్.. నెట్టింట వైరల్!

అయితే సుకుమార్ పై మరింత భారం పడింది. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడంతో సీక్వెల్ కి మరింత క్రేజ్ ఏర్పడింది. దీంతో అభిమానుల అంచనాలు అందుకోవడానికి సుకుమార్ ఇంకొంచెం గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కి కూడా మేకర్స్ ఒక డేట్ ఫిక్స్ చేశారట. వచ్చే ఏడాది సమ్మర్ లో మార్చి 22న ఈ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ డేట్ తరువాత రెండు వారాలకు ఎన్టీఆర్ (NTR) ‘దేవర’ రిలీజ్ ఉంది.

Nani : ఆ సినిమా అవార్డు గెలుచుకోనందుకు బాధ పడుతున్న నాని.. ఏ మూవీ తెలుసా..?

ఇక పార్ట్ 1 మ్యూజిక్ తో ఇండియా మొత్తని ఒక ఊపు ఊపేసిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కూడా నేషనల్ అవార్డు అందుకోవడంతో.. సీక్వెల్ మ్యూజిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ సాంగ్ తరువాత ఇప్పుడు ఈ సీక్వెల్ లో ఎలాంటి ఐటెం నెంబర్ ఇవ్వబోతున్నాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది. అలాగే ఆ ఐటెం సాంగ్ ఈసారి ఏ అందాల భామ మెరబోతుందో అని కూడా ఎదురు చూస్తున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సెకండ్ పార్ట్ లో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు.