Pushpa 2
Pushpa 2 Press Meet : సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులని మెప్పించాయి. ఇక పుష్ప 2 సినిమాని డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నారు. నేడు పుష్ప 2కి సంబంధించి మొదటి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు.
హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో నేడు పుష్ప 2 ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. సినిమా నిర్మాతలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ఏరియాలలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. పుష్ప 2 గురించి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. అలాగే ఇటీవల పుష్ప 2 సినిమా ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 5 న రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా ఈ ప్రెస్ మీట్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
Also Read : Prabhas : నా కెరీర్లో బిగ్గెస్ట్ సాంగ్స్‌లో అది ఒకటి.. వాళ్ళు ఇప్పుడు లేరా అనిపిస్తుంది.. ప్రభాస్ ఎమోషనల్..
అయితే ఈ ప్రెస్ మీట్ కి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ తో ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో సుకుమార్, అల్లు అర్జున్, సినిమాలో నటించిన నటీనటులు ఎవరైనా వస్తరా అనేది సందేహమే. ఇక పుష్ప 2 సినిమా గురించి మొదటి ప్రెస్ మీట్ కావడంతో ఫ్యాన్స్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మరికాసేపట్లో మొదలుకాబోతున్న పుష్ప 2 ప్రెస్ మీట్ లైవ్ ఇక్కడ చూసేయండి..