Sukumar – Ram Charan : సుకుమార్ సినిమాలో చరణ్ అలా కనిపిస్తాడా? RC17 సినిమా వర్క్ మొదలుపెట్టిన సుక్కు..?

పుష్ప 2 తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న సుక్కు RC17 స్క్రిప్ట్‌ రెడీ చేయడంలో బిజీగా ఉన్నాడట.

Sukumar Ready to do Ram Charan RC 17 Movie Script Work after Pushpa 2 Success

Sukumar – Ram Charan : సుకుమార్ ఇన్నేళ్లు పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత సుకుమార్ కాస్త ఖాళీ అయ్యాడు. పుష్ప 3 ఇప్పట్లో ఉండదని అల్లు అర్జున్ స్వయంగా చెప్పాడు. దీంతో సుకుమార్ రామ్ చరణ్ ప్రాజెక్టు పని మొదలుపెట్టనున్నాడు. గతంలో RC17 ప్రాజెక్టుగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.

సుకుమార్ – రామ్ చరణ్ కాంబోలో రంగస్థలం వచ్చి భారీ విజయం సాధించింది. దీంతో వీరి కాంబోపై మరోసారి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC 16 మూవీ షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ స్పీడ్‌గా కంప్లీట్‌ చేసి దసరాకు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా అయిపోయింది ఈ సినిమా.

Also Read : Find The Actress : బైక్ పై కూర్చున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? అమెరికా వాడ్ని పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఇండియన్ టాప్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్..

RC16 షూటింగ్ అవ్వగానే సుకుమార్ సినిమాలో జాయిన్ అవుతాడు చరణ్. పుష్ప 2 తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న సుక్కు RC17 స్క్రిప్ట్‌ రెడీ చేయడంలో బిజీగా ఉన్నాడట. స్ర్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడని, త్వరలో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా మొదలుపెడతారని సుక్కు సన్నిహితులు అంటున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అనౌన్స్ చేస్తూ రెండు గుర్రాలతో ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. అయితే RC17పై సోషల్ మీడియాలో అప్పుడే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

సుక్కుతో చేయబోయే RC 17 మూవీలో రామ్‌చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. ఇది ప‌క్కా యాక్షన్ మూవీ అంటున్నారు. సుక్కు చెర్రీ కాంబినేషన్‌లో వచ్చిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ రంగ‌స్థలం బ్లాక్‌ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు RC17 మూవీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ పిక్చరే అంటున్నారు. గతంలో సుకుమార్ ఈ సినిమా గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Also Read : Khaidi 2 : కార్తీ కోసం రాబోతున్న నలుగురు హీరోలు.. ఖైదీ 2లో స్టార్ హీరోలు..

పక్కా మట్టి వాసన సినిమా ఇది అని గతంలో సుకుమార్ అన్నాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చింది. చరణ్‌కు కూడా జాతీయ అవార్డ్ తెప్పిస్తాడా సుక్కు అని అనుకుంటున్నారు. ఇక రామ్‌చరణ్, బుచ్చిబాబు సినిమా అవ్వగానే సుకుమార్, రామ్‌చరణ్‌ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది.