Chef Mantra Project K : ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సుమ కనకాల ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K’ సీజన్ 4

సుమ కనకాల హోస్ట్‌గా చేస్తున్న‌'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K' సీజన్ 4 ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

Suma Kanakala Chef Mantra Project K Show streaming On Aha ott platform

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కుటుంబం అంతా క‌లిసి చూసేలా, వైవిధ్య‌మైన‌, మంచి కంటెంట్ ఉన్న మూవీస్‌, వెబ్ సిరీస్‌, టాక్ షోల‌తో ఆడియ‌న్స్‌ను అల‌రిస్తోంది. తాజాగా సుమ క‌న‌కాల హోస్ట్‌గా చేస్తోన్న ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K’ ఆహోలో స్ట్రీమింగ్ అవుతోంది.

‘చెఫ్ మంత్ర’ 1, 2, 3 సీజ‌న్లు ఎంత‌గానో అల‌రించాయి. ఇక సీజ‌న్ 4 మ‌రింతంగా అల‌రించ‌నుంది.’ ప్రాజెక్ట్ కె’ అంటే ఏమిది అనేది క్యూరియాసిటీ పెంచుతోంది. సుమతో పాటు నటుడు జీవన్ కుమార్ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కెలో తన వంతు వినోదాన్ని జోడిస్తున్నారు.

Allu Arjun-Atlee : అల్లు అర్జున్, అట్లీ మూవీలో ఐదుగురు హీరోయిన్లు

అమర్ దీప్-అర్జున్, దీపికా రంగరాజు-సమీరా భరద్వాజ్, సుప్రిత-యాదమ్మ రాజు, ప్రషు-ధరణి, విష్ణుప్రియా-పృథ్వీ జోడీ లు రుచికరమైన వంటకాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.

Sourav Ganguly : ఖాకీ డ్రెస్‌లో సౌర‌వ్ గంగూలీ.. మొన్న‌టి వ‌ర‌కు మైదానంలో.. ఇప్పుడు సినిమాలో..

తెలుగింటి వంటలతో పాటు సర్ ప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు ప్రతి ఎపిసోడ్ లో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 4లో అందించ‌నుంది. ఇంకెందుకు ఆల‌స్యం తొలి ఎపిసోడ్ చూసి ప్రాజెక్ట్ కె అంటే ఏమిటో తెలుసుకోండి.