Allu Arjun-Atlee : అల్లు అర్జున్, అట్లీ మూవీలో ఐదుగురు హీరోయిన్లు
అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ మూవీలో నటించనున్నారు.

Allu Arjun and Atlee Kumar Movie Update
మామలుగా ఏ సినిమాలోనైనా ఒకరిద్దరు హీరోయిన్లు ఉంటారు. కథ డిమాండ్ చేస్తే.. ముగ్గురితో స్టెప్పులు వేయించిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. కానీ అట్లీ – అల్లుఅర్జున్ మూవీలో హీరోయిన్స్ నెంబర్స్ పెరుగుతున్నాయట. మరి అంతమంది హీరోయిన్స్ ని ఎక్కడి నుంచి రప్పిస్తున్నారు. అల్లు అర్జున్ పక్కన స్టెప్పులేసి లక్కీ ఛాన్స్ ఎవరికి ఇస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో అతి పెద్ద ప్రాజెక్టుల్ని లైన్‌లో పెట్టాడు. పుష్ప-2 ఏకంగా 1800 కోట్ల గ్రాస్ ను బీట్ చేయడతోనేషనల్ వైడ్ గా క్రేజ్ పెరిగింది. ఇక నెక్స్ట్ రాబోయే సినిమాలు అంతకుమించి అనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ. అసలైతే పుష్ప-2 తర్వాత వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ వర్క్ పెండింగ్ లో ఉండడంతో డైరెక్టర్ అట్లీకి డేట్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు బన్నీ.
Sourav Ganguly : ఖాకీ డ్రెస్‌లో సౌరవ్ గంగూలీ.. మొన్నటి వరకు మైదానంలో.. ఇప్పుడు సినిమాలో..
ఈ మూవీకి సంబంధించి ఈ నెల 20న అఫీషియల్ అగ్రిమెంట్ జరిగిపోనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ ఫారన్ టూర్ ముగించుకొని ఇండియాకు తిరిగొచ్చారు. ఏప్రిల్ లో లేదా మేలో ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టాలని చేస్తున్నారట డైరెక్టర్ అట్లీ.
తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్షర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తో మరో హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటారని మరో టాక్ నడుస్తోంది. ఈ కీలక పాత్ర కోసం తమిళ స్టార్ హీరోను సెలెక్ట్ చేసుకున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే అట్లీ-బన్నీ సినిమాపై ఓ కొత్త గాసిప్ తమిళ ఇండస్ట్రీలో బిగ్ సౌండ్ చేస్తోంది. ఈ సినిమాల్లో అల్లు అర్జున్ ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో రోమాన్స్ చేస్తారంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. ఈ మూవీ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యింది.
అట్లీ రాసుకున్న స్టోరీ ప్రకారం జాన్వీ పాపతో పాటు మరో నలుగురు హీరోయిన్స్ కి కూడా స్పేస్ ఉందట. జాన్వీతో పాటు ఓ తమిళ హీరోయిన్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఇంకో ముగ్గురు హీరోయిన్స్ ని విదేశాల నుంచి ఇన్ పోర్ట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అమెరికన్, కొరియన్ భామలకు ఈ మూవీలో చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట. మరి ఆ ముగ్గురు లక్కీ గర్ల్స్ ఎవరో చూడాలి.