Sourav Ganguly : ఖాకీ డ్రెస్‌లో సౌరవ్ గంగూలీ.. మొన్నటి వరకు మైదానంలో.. ఇప్పుడు సినిమాలో..
సౌరవ్ గంగూలీ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్యాట్ పట్టుకుని మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో అలరించిన కొందరు క్రికెటర్లు.. యాక్టర్లుగానూ అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన డేవిడ్ వార్నర్ సైతం నితిన్ రాబిన్ హుడ్ మూవీతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు.
ఇక టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం నటుడిగా తెరంగ్రేటం చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడట. పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో ఖాకీ డ్రెస్‌లో ఉన్న ఈ మాజీ కెప్టెన్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత, జీత్, పరంబ్రత ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఖాకీ ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2). ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో వేదికగా ఈ వెబ్ సిరీస్ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్‌సిరీస్‌లో గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు.
Madraskaaran : ‘మద్రాస్ కారన్’ మూవీ రివ్యూ.. నిహారిక తమిళ సినిమా ఎలా ఉందంటే..
ఇదే విషయం పై వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో నిర్మాత నీరజ్ పాండేకు ఓ ప్రశ్న ఎదురైంది. ఈ సిరీస్‌లో గంగూలీ నటించారా? అని అడుగగా.. తాను చెప్పడం ఎందుకనీ, మార్చి 20న వెబ్ సిరీస్ చూస్తే గంగూలీ నటించాడో లేదో అనే విషయం తెలిసిపోతుందని తెలిపాడు.
దీంతో ఈ వెబ్‌సిరీస్‌లో గంగూలీ నటించాడని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం ప్రమోషన్స్‌లో భాగంగా గంగూలీ ఖాకీ డ్రెస్ వేసుకున్నారని అంటున్నారు. చూడాలి మరి వీటిలో ఏది నిజమో.
ప్రముఖ ఐపీఎల్ ఆఫీసర్ అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఖాకీ ది బిహార్ చాప్టర్ తెరకెక్కింది. 2022లో నెట్‌ఫ్లిక్స్ విడుదలైన ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే దీనికి కొనసాగింపుగా ఖాకీ 2 తెరకెక్కింది.