Sumaya Reddy Dear Uma Movie Release Date Announced
Dear Uma : ఓ కొత్త పాయింట్‌తో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న సినిమా ‘డియర్ ఉమ’. తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా మారి ఈ సినిమాని తీసుకొస్తుంది. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా ఈ డియర్ ఉమ తెరకెక్కుతుంది.
ఇప్పటికే డియర్ ఉమ నుంచి వచ్చిన గ్లింప్స్, పాటలు, టీజర్ ఆసక్తి నెలకొల్పాయి. తాజాగా మూవీ యూనిట్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు ఓ మెసేజ్ ఇవ్వబోతున్న డియర్ ఉమ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూపలక్ష్మీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.