Harsh Roshan : ‘కోర్ట్’ హీరో వీడియోలకు.. రీల్ తండ్రి కామెంట్.. అమ్మాయిలతో ఆ గెంతులు ఏంట్రా?.. భలే కామెంట్స్ చేశారే..
ప్రమోషన్స్ లో హర్ష రోషన్, శ్రీదేవి కోర్ట్ సినిమాలో సాంగ్ కి డ్యాన్సులు వేశారు.

Actor Rajasekhar Funny Comments to Harsh Roshan Court Movie Promotional Videos
Harsh Roshan : నాని నిర్మాణంలో తెరకెక్కిన కోర్ట్ సినిమా ఇటీవల మార్చ్ 14న రిలీజయి భారీ హిట్ అయింది. ప్రియదర్శి, హర్ష రోషన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అయి 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమా రిలీజ్ తర్వాత కూడా మూవీ యూనిట్ ప్రమోషన్స్ గట్టిగానే చేసారు. సినిమాలో నటించిన హర్ష రోషన్, శ్రీదేవి పలు కాలేజీలకు వెళ్లి సందడి చేసారు.
ఈ క్రమంలో ప్రమోషన్స్ లో హర్ష రోషన్, శ్రీదేవి కోర్ట్ సినిమాలో సాంగ్ కి డ్యాన్సులు వేశారు. కాలేజీ స్టూడెంట్స్ తో కూడా కలిసి డ్యాన్సులు వేశారు. ఈ డ్యాన్స్ వీడియోలు హర్ష రోషన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అయితే కోర్ట్ సినిమాలో హర్ష రోషన్ తండ్రి పాత్రలో నటించిన నటుడు రాజశేఖర్ ఈ వీడియోలకు సరదాగా కామెంట్స్ చేసారు.
Also Read : Pradeep : యాంకర్ ప్రదీప్ మొదటి సినిమా ఏంటో తెలుసా? 16 ఏళ్ళ క్రితం.. అందులో హీరోయిన్ ఎవరో తెలుసా?
హర్ష రోషన్ డ్యాన్స్ వీడియోలకు రాజశేఖర్.. ఒరే చందూ వాళ్ళలో ఎవరూ మైనర్ అమ్మాయిలు లేరు కదా.. నాకు ఇంక కోర్టులు చుట్టూ తిరుగుతూ కాళ్ళు పట్టుకొనే ఓపిక లేదు రా. అమ్మాయిలతో ఆ గెంతులు ఏంట్రా చందు ఆ? అంటూ సరదాగా కామెంట్స్ చేసారు. ఈ సినిమాలో హర్ష రోషన్ పాత్ర ఓ మైనర్ అమ్మాయిని ప్రేమిస్తే విలన్ అతనిపై ఫేక్ పోక్సో కేసు పెడితే ఎలా బయటకి వచ్చారు అని కథాంశం.
అందుకే రాజశేఖర్ సరదాగా అలా సినిమా పాత్రతో రోషన్ వీడియోలకు కామెంట్స్ చేయడంతో నెటిజన్లు భలే రిప్లై ఇచ్చారు అంటూ రాజశేఖర్ కామెంట్స్ ని లైక్ కొట్టి వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram