Pradeep : యాంకర్ ప్రదీప్ మొదటి సినిమా ఏంటో తెలుసా? 16 ఏళ్ళ క్రితం.. అందులో హీరోయిన్ ఎవరో తెలుసా?
ప్రదీప్ మొదటి సినిమా ఎవరికీ తెలియదు.

Do You Know Anchor Pradeep First Movie as Artist Before 16 Years Details Here
Pradeep : యాంకర్ ప్రదీప్ ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్జే నుంచి యాంకర్ గా మారి ఓ పదేళ్ల పాటు టీవీలో యాంకర్ గా అనేక టీవీ షోలతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించాడు. టీవీలో యాంకర్ గా చేస్తూనే గతంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు. అత్తారింటికి దారేది, జులాయి సినిమాలతో సినిమాల్లో కూడా గుర్తింపు తెచ్చుకొని కొన్ని సినిమాల్లో నటించాడు.
అయితే ప్రదీప్ మొదటి సినిమా ఎవరికీ తెలియదు. ప్రదీప్ ఆర్జేగా పనిచేస్తున్నప్పుడే అక్కడికి ప్రమోషన్స్ కోసం వచ్చే సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రదీప్ మొదటి సినిమా ఆర్జేగా ఉన్నప్పుడే నటించాడు. యాంకర్ ప్రదీప్ మొదటి సినిమా పేరు ‘మనోరమ’.
Also Read : Oh Bhama Ayyo Rama Song : సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ నుంచి టైటిల్ సాంగ్ వచ్చేసింది..
మనోరమ సినిమాలో ఛార్మి హీరోయిన్. ఈ సినిమా హైదరాబాద్ గోకుల్ చాట్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఆధారంగా తెరకెక్కించారు. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో నిషాన్, ఛార్మి జంటగా ఈ సినిమాని తీశారు. 2009 లో ఈ సినిమా రిలీజయింది. ఈ సినిమాలో ప్రదీప్ ఓ చిన్న పాత్ర చేసాడు. సినిమాలో మూడు నాలుగు చోట్ల ప్రదీప్ కనిపిస్తాడు.
ప్రదీప్ హీరోగా తన రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో రాబోతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు.
Also Read : Redin Kingsley : తండ్రి అయిన స్టార్ కమెడియన్.. కూతుర్ని ఎత్తుకొని..
ప్రదీప్ మాట్లాడుతూ.. హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ ల మీద ఛార్మి గారు మెయిన్ లీడ్ లో తీసిన సినిమాలో నేను నటించాను. అదే నా మొదటి సినిమా. అప్పుడే నేను మొదటిసారి సినిమా కెమెరా ఫేస్ చేయడం. నా షూటింగ్ మొదటి రోజే బాంబు బ్లాస్ట్ సీన్ షూట్ చేసారు. ఆ సీన్ లో ఆర్టిస్టులు ఎవ్వరూ సరిగ్గా చేయలేదని ఆ రోజు ప్యాకప్ చెప్పేసి మళ్ళీ తర్వాత చేసారు. సినిమా రిలీజయ్యాక మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆర్జేలో ఫ్రెండ్స్ అందర్నీ తీసుకెళ్ళాను. సినిమా మొత్తం మూడు నాలుగు చోట్ల కనిపిస్తాను అంతే అని తెలిపాడు.