Redin Kingsley : తండ్రి అయిన స్టార్ కమెడియన్.. కూతుర్ని ఎత్తుకొని..
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు రెడిన్ కింగ్‌స్లీ.

Tamil Star Comedian Redin Kingsley became Father
Redin Kingsley : తాజాగా తమిళ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్‌స్లీ తండ్రి అయ్యారు. కొలమావు కోకిల సినిమాతో తమిళ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన రెడిన్ కింగ్‌స్లీ తమిళ్ లో అనేక సినిమాలతో నవ్వించాడు. అవి తెలుగులో డబ్బింగ్ అవ్వడంతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు రెడిన్ కింగ్‌స్లీ. తెలుగు క, ది వారియర్ సినిమాలతో కూడా మెప్పించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు రెడిన్ కింగ్‌స్లీ.
2023లో తమిళ టీవీ నటి సంగీతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రెడిన్ కింగ్‌స్లీ. కొన్నాళ్ల క్రితం సంగీత తల్లి కాబోతున్నట్టు తన ప్రగ్నెన్సీని ప్రకటించింది. ఇటీవలే సీమంతం నిర్వహించి బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు ఈ జంట. ఈ జంటకు నిన్నే పండంటి పాప పుట్టింది.
Also See : Jani Master Daughter : షూటింగ్ సెట్లో.. జానీ మాస్టర్ కూతురు పుట్టిన రోజు వేడుకలు..
తాజాగా సంగీత – రెడిన్ కింగ్‌స్లీ తమ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. పాప ఫేస్ కనపడకుండా రెడిన్ కింగ్‌స్లీ కూతుర్ని ఎత్తుకున్న ఫోటోని షేర్ చేసి.. మీ అందరి ఆశీస్సులకు ధన్యవాదాలు. ప్రిన్సెస్ పుట్టింది అంటూ రాసుకొచ్చారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.