Dear Uma : ‘డియర్ ఉమ’ టీజర్ రిలీజ్.. పేషేంట్స్ కోసం పోరాడే డాక్టర్ కథ..

డియర్ ఉమ సినిమా నుంచి పోస్టర్లు, గ్లింప్స్, పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు.

Sumaya Reddy Dear Uma Movie Teaser Released by Director Shiva Nirvana

Dear Uma : తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా తెరకెక్కిస్తున్న సినిమా ‘డియర్ ఉమ’. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై సుమయ రెడ్డి నిర్మాణంలో సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో పృథ్వీ అంబర్, సుమయ జంటగా ఈ డియర్ ఉమ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతుంది.

Also Read : NTR – Sukumar : డైరెక్టర్ భార్య పుట్టిన రోజు వేడుకలు.. ఫ్యామిలీతో ఎన్టీఆర్, సుకుమార్.. మహేష్ బాబు మిస్సింగ్.. ఫోటో వైరల్..

ఇప్పటికే డియర్ ఉమ సినిమా నుంచి పోస్టర్లు, గ్లింప్స్, పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. డైరెక్టర్ శివ నిర్వాణ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. మీరు కూడా డియర్ ఉమ టీజర్ చూసేయండి..

ఈ టీజర్.. ‘గుడిలో దేవుడి వద్ద చేసే ప్రార్థనల కన్నా.. హాస్పిటల్‌లో నాలుగు గోడల మధ్య చేసే ప్రార్థనేలా ఎక్కువ అంటూ ప్రారంభమై ఓ లవ్ స్టోరీతో పాటు ఓ మెసేజ్ కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది. చివర్లో.. పేషెంట్స్‌కి, డాక్టర్లకు మధ్య మీలాంటి కమిషన్స్ ఏజెన్సీ, బ్రోకర్లు ఉండకూడదు సర్.. దీని కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అంటూ హీరోయిన్ డైలాగ్ చెప్పడంతో పేషేంట్స్ కోసం పోరాడే ఓ డాక్టర్ గురించి ఈ సినిమా ఉండొచ్చు అని తెలుస్తుంది.

లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతున్న డియర్ ఉమ సినిమాలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూపలక్ష్మీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.