Sundarakanda
Sundarakanda : నారా రోహిత్ హీరోగా శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘సుందరకాండ’. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాణంలో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సుందరకాండ సినిమా ఇటీవల వినాయకచవితికి ఆగస్టు 27న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది.(Sundarakanda)
హీరో తల్లి కూతుళ్ళని లవ్ చేసిన కథగా ఓ ట్విస్ట్ తో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్, చిన్న ఎమోషన్ తో ఈ సినిమా ఆసక్తిగా సాగుతుంది. సుందరకాండ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా జియో హాట్ స్టార్ ఓటీటీలోకి సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది.
Also See : Little Hearts : సూపర్ హిట్ సినిమా.. ‘లిటిల్ హార్ట్స్’ వర్కింగ్ స్టిల్స్.. ఫొటోలు..