Sundeep Kishan : సందీప్ కిషన్ ఇంట్లో విషాదం.. గొప్ప ప్రేమకథ అంటూ సందీప్ ఎమోషనల్ పోస్ట్..

హీరో సందీప్ కిషన్ ఇంట్లో విషాదం నెలకొంది.

Sundeep Kishan Grand Mother Passed Away

Sundeep Kishan : హీరో సందీప్ కిషన్ ఇంట్లో విషాదం నెలకొంది. సందీప్ కిషన్ నానమ్మ ఆగ్నెస్ లక్ష్మి మరణించారు. దీంతో సందీప్ కిషన్, అతని మేనమామ, స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కూడా ఆమె అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ మేరకు సందీప్ కిషన్ తన తాత, నానమ్మ ఫోటోలను షేర్ చేస్తూ.. మా చివరి గ్రాండ్ పేరెంట్ మా నానమ్మను నిన్న కోల్పోయాను. మా తాత కృష్ణం నాయుడు ఒక షిప్ ఆర్కిటెక్ట్. మా నానమ్మ ఆగ్నెస్ వైజాగ్ లోని ఒక పాఠశాలలో ప్రధానోపాద్యాయురాలు. 1960 లో వీరిది ఇంటర్ రిలీజియన్ ప్రేమకథ. వీరి ప్రేమకథ ఒక సినిమా కథలా అనిపిస్తుంది. వీరు పెళ్లి చేసుకున్నాక మా తాతగారు జోసెఫ్ కృష్ణం నాయుడు, నానమ్మ ఆగ్నెస్ లక్ష్మి అయ్యారు. నాకు తెలిసిన గొప్ప ప్రేమ కథ వీరిది అని ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

Also See : Akhil Sarthak – Rithu Chowdary : తిరుమలలో అఖిల్ సార్థక్ – రీతూ చౌదరి జంటగా.. ఫొటోలు వైరల్..

సందీప్ కిషన్ నానమ్మ ఆగ్నెస్ లక్ష్మి వైజాగ్ దగ్గర జ్ఞానాపురంలో ఉంటున్నారు. గతంలో అనేక స్కూల్స్ లో టీచర్ గా, హెడ్ మాస్టర్ గా పనిచేసారు. ఎంతోమంది పేదపిల్లలకు ఆవిడ చదువు అందించారని, వారి అవసరాలు తీర్చారని అక్కడి వారు గొప్పగా చెప్తారు. వయోభారంతో పలు ఆరోగ్య సమస్యలతో ఆగ్నెస్ లక్ష్మి 88 ఏళ్ళ వయసులో మరణించారు. ఆమెని క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతిలో సెయింట్‌ పీటర్స్‌ కేథడ్రల్‌ చర్చి సెమెట్రీలో భూస్థాపన చేసారు.

Also Read : Manchu Vishnu : మంచు విష్ణు కొడుకు ‘కన్నప్ప’తో ఎంట్రీ.. మేకింగ్ వీడియో చూశారా.. విష్ణు ఎమోషనల్ పోస్ట్..