Manchu Vishnu : మంచు విష్ణు కొడుకు ‘కన్నప్ప’తో ఎంట్రీ.. మేకింగ్ వీడియో చూశారా.. విష్ణు ఎమోషనల్ పోస్ట్..
మీరు కూడా విష్ణు కొడుకు అవ్రామ్ కన్నప్ప మేకింగ్ వీడియో చూసేయండి..

Manchu Vishnu Shares his Son Avram Kannappa Making Video
Manchu Vishnu : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాని సొంత బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు టీజర్లు, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.
కన్నప్ప సినిమా జూన్ 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాతో మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే విష్ణు కూతుళ్లపై తెరకెక్కించిన సాంగ్ ని రిలీజ్ చేసారు. తాజాగా మంచి విష్ణు తన కొడుకు కన్నప్ప కోసం తయారయిన మేకింగ్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసారు.
Also Read : Jabardasth : జబర్దస్త్ లో కొత్త యాంకర్.. ఈసారి అబ్బాయి.. వార్నింగ్ ఇచ్చిన రష్మీ.. ప్రోమో వైరల్..
మంచు విష్ణు కొడుకు అవ్రామ్ కన్నప్ప మేకింగ్ వీడియో షేర్ చేసి.. నా లిటిల్ అవ్రామ్ కన్నప్పతో డెబ్యూట్ ఇస్తున్నాడు. అతను సెట్ కి రావడం, డైలాగ్స్ చెప్పడం నా లైఫ్ లో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్స్. ఒక తండ్రిగా, మీరు ఒకప్పుడు కలలుగన్న ఆకాశం కిందే మీ బిడ్డ కూడా ఎదగడం చూడటానికి గొప్పగా ఉంటుంది. ఇది కేవలం డెబ్యూట్ మాత్రమే కాదు లైఫ్ టైం మెమరీ. నాకు ఇచ్చినట్టే నా కొడుక్కి కూడా మీ అందరూ ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటున్నాను. అవ్రామ్ జర్నీ కన్నప్పతో మొదలుకానుంది అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు.
మీరు కూడా విష్ణు కొడుకు అవ్రామ్ కన్నప్ప మేకింగ్ వీడియో చూసేయండి..
Also Read : Express Hari – Ashu Reddy : షోలో అషురెడ్డి కాలు పట్టుకున్న ఎక్స్‌ప్రెస్ హరి.. ఏం చేసాడంటే.. ప్రోమో వైరల్..