Fighter shiva : ‘ఫైటర్ శివ’ టీజర్ విడుదల.. నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా..

మీరు కూడా ఫైటర్ శివ టీజర్ చూసేయండి..

Fighter shiva

Fighter shiva : కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్లపై ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ నిర్మాణంలో ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఫైటర్ శివ’. మణికాంత్, ఐరా బన్సాల్ జంటగా నటిస్తుండగా సునీల్, వికాస్ వశిష్ట.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఫైటర్ శివ టీజర్ ను నిర్మాత అశ్వనీదత్ రిలీజ్ చేశారు.

టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో మణికాంత్ మాట్లాడుతూ.. నన్ను హీరోని చేయాలని ఈ సినిమా కోసం మా నాన్న చాలా కష్టపడ్డారు. పెట్టిన ప్రతీ రూపాయిని వడ్డీతో సహా ఇండస్ట్రీ నుంచి తీసుకు వెళ్తాను. మధ్యలో ఇరుక్కుపోయిన మమ్మల్ని రమేష్ గారు ఒడ్డుకు తీసుకు వచ్చారు అని అన్నారు.

డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. అశ్వనీదత్, సంపత్ నంది గారి వల్లే ఈ ఫైటర్ శివ ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు నేను చిన్న సినిమా తీస్తున్నాను కానీ భవిష్యత్తులో మాత్రం నేను పెద్ద దర్శకుడిని అవుతాను. అప్పుడు నా వద్దకు సాయం కోసం వచ్చే కొత్త వారికి కచ్చితంగా అందుబాటులో ఉంటాను. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మన ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుంది. త్వరలో మిరాకిల్ అనే సినిమాతో రాబోతున్నాను. మూడు నెలల క్రితం క్యాన్సర్‌తో మా అమ్మ మరణించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో మా అమ్మకు ట్రీట్మెంట్ జరిగింది. ఆ ట్రీట్మెంట్, హాస్పిటల్ వల్లే మా అమ్మ గారు ఇంకో మూడు నెలలు ఎక్కువగా బతికారు. ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నందమూరి బాలకృష్ణ గారికి థాంక్స్ అని తెలిపారు.

ఎమ్మెల్యే రామలింగం మాట్లాడుతూ.. ప్రభుత్వం డ్రగ్స్ మీద చేసే పోరాటం ఆధారంగా ఫైటర్ శివను తెరకెక్కించారు. చిరంజీవి గారు ఎప్పుడూ కూడా కొత్త వాళ్లు రావాలని చెబుతుంటారు. ఇప్పుడు మణికాంత్ అనే కొత్త హీరో రాబోతోన్నారు అని అన్నారు. నిర్మాత నర్సింహా గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద పోరాడుతున్నారు. అదే సందేశాన్ని ఈ మూవీతో మేం ఇవ్వబోతోన్నాం. యువతను మేల్కొపేలా మా ఫైటర్ శివ ఉంటుంది అని అన్నారు. నిర్మాత ఉన్నం రమేష్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలించాలనే ప్రభుత్వ పోరాటాన్ని ఆధారంగా తీసుకుని ఫైటర్ శివను మా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కించారు. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. అన్న తేడా లేకుండా అవుట్ పుట్‌ను బట్టి ఆడియెన్స్ ఆదరిస్తారు అని అన్నారు.

Also Read : Kangana Ranaut : డేటింగ్ యాప్స్, లివ్-ఇన్ కల్చర్ పై కంగనా ఫైర్.. గర్భం వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు?