Sunil Grover Imitates Rajamouli ad Rajagoli in The Great Indian Kapil Show Fans Hurts
Rajamouli – Sunil Grover : ఇటీవల దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ లోని ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలోకి వెళ్లారు. కపిల్ శర్మ తన మాటలతో గెస్టులను నవ్విస్తూ ఇంటర్వ్యూ చేస్తారు. ఈ షోలో కొంతమంది కమెడియన్స్ ని రప్పించి మరింత కామెడీ చేస్తారు. అయితే ఈ షోలో నటుడు సునీల్ గ్రోవర్ ఎవరో ఒకరి సెలబ్రిటీ గెటప్ వేసుకొచ్చి వాళ్ళ లాగా ఇమిటేట్ చేస్తారు. ఇలా పాపులర్ పర్సనాలిటీస్ ని ఇమిటేట్ చేస్తూ చేసే కామెడీ ఒక్కోసారి హద్దులు దాటుతుంది. ఆ పర్సనాలిటీస్ ని అవమానించినట్లు అవుతుంది. గతంలో కూడా సునీల్ గ్రోవర్ పై ఈ విషయంలో విమర్శలు వచ్చాయి.
Also Read : Padmapriya : సినిమా సెట్‌లో అందరి ముందు డైరెక్టర్ కొట్టాడు.. ఆ సంఘటన గురించి మాట్లాడిన హీరోయిన్..
అయితే తాజాగా ఎన్టీఆర్ షోకి రావడంతో సునీల్ గ్రోవర్ రాజమౌళి గెటప్ లో వచ్చాడు. రాజమౌళిని ఇమినేట్ చేస్తూ కామెడీ చేసాడు. అయితే అతని పేరుని రాజగోళి అని చెప్పుకున్నాడు. అలాగే ఒక కథ చెప్తాను, కమర్షియల్ సినిమా అంటూ ఒక లైన్ చెప్పడం ఆ తర్వాత మొత్తం VFX, VFX అని అనడం. అలా మొత్తం VFX లతోనే సినిమా తీస్తాను అన్నట్టు కామెడీగా చెప్పాడు. ఇలా రాజమౌళిని ఇమిటేట్ చేస్తూ సునీల్ గ్రోవర్ కామెడీ చేసాడు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
అయితే సునీల్ గ్రోవర్ చేసిన కామెడీ హద్దులు దాటిందని, ఇండియన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తిని, ఆస్కార్ వేదిక వరకు మన సినిమాను తీసుకెళ్లిన వ్యక్తిని ఇలా రాజగోళి అంటూ పేరు మార్చి అవమానించారని, అతను కేవలం VFX లతోనే సినిమా తీస్తాడు, కథేం ఉండదు అనేలా అనుమానించారని, ఎన్టీఆర్ ముందే ఇలా చేయడం ఏంటని రాజమౌళి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. పలువురు తెలుగు సినీ ప్రేక్షకులు సునీల్ గ్రోవర్ పై, కపిల్ శర్మపై మండిపడుతున్నారు. అయితే బాలీవుడ్ వాళ్ళు మాత్రం సునీల్ గ్రోవర్ కామెడీ అదిరింది అంటూ వీడియో వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై ఎవరైనా టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందిస్తారేమో చూడాలి.