Padmapriya : సినిమా సెట్‌లో అందరి ముందు డైరెక్టర్ కొట్టాడు.. ఆ సంఘటన గురించి మాట్లాడిన హీరోయిన్..
తాజాగా ఓ కార్యక్రమంలో పద్మప్రియ గతంలో 2007లో జరిగిన సంఘటన గురించి మరోసారి మాట్లాడింది.

Padmapriya Janakiraman Comments on 2007 Director Issue
Padmapriya Janakiraman : ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనాలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి హీరోయిన్స్, నటీమణులు కొందరు తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను బయటకి చెప్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ తనకు జరిగిన సంఘటన గురించి మరోసారి తెలిపింది. తమిళ కుటుంబానికి చెందిన పద్మప్రియ తెలుగు సినీ పరిశ్రమలో శ్రీను వాసంతి లక్ష్మి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయి ఆ తర్వాత తమిళ్, మలయాళీ, హిందీ సినిమాలు చేసింది. ఎక్కువగా మలయాళం సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపొయింది పద్మప్రియ.
అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పద్మప్రియ గతంలో 2007లో జరిగిన సంఘటన గురించి మరోసారి మాట్లాడింది. 2007లో పద్మప్రియ ఓ తమిళ్ సినిమా చేస్తుండగా ఆ సినిమా డైరెక్టర్ సామి సినిమా సెట్ లో అందరి ముందు పద్మప్రియను కొట్టాడు. అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారి ఆ డైరెక్టర్ పై ఒక సంవత్సరం పాటు బ్యాన్ విధించారు.
తాజాగా ఆ సంఘటనని గుర్తుచేసుకుంటూ పద్మప్రియ మాట్లాడుతూ.. నన్ను ఆ డైరెక్టర్ కొడితే కొంతమంది నేనే ఆ డైరెక్టర్ ని కొట్టానని ఆరోపించారు. మొదట్లో నా వాదనని ఎవరూ పట్టించుకోలేదు. మహిళల అనుభవాలను కొట్టి పారేస్తారు లేదా వాళ్లదే తప్పు అన్నట్టు చిత్రీకరిస్తారు. నాకు ఎదురైన అనుభవమే ఇందుకు ఉదాహరణ. ఆ ఘటన తర్వాత ఆ డైరెక్టర్ ని తమిళ పరిశ్రమ బ్యాన్ చేసింది. కానీ నేనే ఆ తర్వాత తమిళ సినిమాలు తగ్గించేసాను అని తెలిపింది.
తెలుగులో శీను వాసంతి లక్ష్మి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పద్మప్రియ ఆ తర్వాత తెలుగులో అందరి బంధువయ, పటేల్ సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తుంది. పద్మప్రియ భరతనాట్యం కళాకారిణి కూడా. ప్రస్తుతం మలయాళ పరిశ్రమలో వుమెన్ సేఫ్టీ గురించి పనిచేస్తుంది.