Sree Vishnu : హీరో శ్రీవిష్ణు U19 క్రికెట్ స్టేట్ ప్లేయర్ అని తెలుసా? అంబటి రాయుడు గురించి సచిన్‌తో పోలుస్తూ కామెంట్స్..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు తన గురించి ఆసక్తికర విషయం తెలిపారు.

Sree Vishnu : హీరో శ్రీవిష్ణు U19 క్రికెట్ స్టేట్ ప్లేయర్ అని తెలుసా? అంబటి రాయుడు గురించి సచిన్‌తో పోలుస్తూ కామెంట్స్..

Sree Vishnu Played Under 19 Cricket for Andhra Pradesh Comments on Ambati Rayudu

Updated On : October 2, 2024 / 7:32 AM IST

Sree Vishnu : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా దూసుకుపోతున్నాడు. ఇటీవలే సామజవరగమన, ఓమ్ భీమ్ బుష్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు స్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు తన గురించి ఆసక్తికర విషయం తెలిపారు.

శ్రీ విష్ణు మాట్లాడుతూ.. సచిన్ ప్రేరణతో క్రికెట్ లోకి వెళ్ళాను. నేను ఆంధ్ర తరపున స్టేట్ లెవల్లో అండర్ 19 ఆడాను. అప్పట్లో అంబటి రాయుడు హైదరాబాద్ కు ఆడేవాడు. అప్పుడు రాయుడు గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళము. టీమ్ లో అందరూ రాయుడు బాగా ఆడతాడు అంట, రాయుడు సూపర్ ప్లేయర్ అని అనుకునేవాళ్లం. అంబటి రాయుడు నెక్స్ట్ సచిన్ అవుతాడు అని అప్పట్లో మా టీమ్ లో అంతా అనుకునేవాళ్లం అని తెలిపాడు. దీంతో శ్రీ విష్ణు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Pawan Kalyan : తమిళ్‌లో తన ఫేవరేట్ డైరెక్టర్ ఎవరో చెప్పిన పవర్ స్టార్.. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా పడితే..

అయితే స్టేట్ లెవల్లో అండర్ 19 క్రికెట్ ఆడిన శ్రీవిష్ణు అది వదిలేసి సినిమాలోకి ఎందుకు వచ్చాడు? సినీ పరిశ్రమలో నిర్వహించే CCL లో ఎందుకు ఆడట్లేదు అని ఫ్యాన్స్, నెటిజన్లు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మరి వీటికి శ్రీవిష్ణు సమాధానం ఇస్తాడేమో చూడాలి.