×
Ad

Trimukha : సంక్రాంతి సినిమాల తర్వాత తెలుగులోకి వస్తున్న సన్నీ లియోన్..

సన్నీ లియోన్ మెయిన్ లీడ్ లో చేసిన తెలుగు సినిమా రిలీజ్ కి రెడీ అయింది. (Trimukha)

Trimukha

Trimukha : సంక్రాంతికి ఇటీవల అయిదు సినిమాలు రిలీజయి ప్రేక్షకులను మెప్పించాయి. సంక్రాంతి పండగ అయిపోయినా సినిమాలు మాత్రం థియేటర్స్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్ లు అనౌన్స్ చేయలేదు. దీంతో పలు చిన్న సినిమాలు జనవరి సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి.(Trimukha)

ఈ క్రమంలో సన్నీ లియోన్ మెయిన్ లీడ్ లో చేసిన తెలుగు సినిమా రిలీజ్ కి రెడీ అయింది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాణంలో రజేశ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘త్రిముఖ’. సన్నీలియోన్ మెయిన్ లీడ్ లో యోగేష్ కల్లే, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, ప్రవీణ్, షకలక శంకర్, ఆషు రెడ్డి, సుమన్, రవి ప్రకాష్, సాహితి, సూర్య, జీవా, జెమిని సురేష్.. పలువురు కీలక పాత్రలతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Naresh : నాతో మంచి లైఫ్ గడపాలి మీరు.. పవిత్ర మాటలకు నరేష్ ఎమోషనల్..

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ని అనౌన్స్ చేసినా పలు మార్లు వాయిదా పడగా ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. త్రిముఖ సినిమా జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. డెబ్యూ హీరోతో తెరకెక్కిన ఈ సినిమా 500 థియేటర్లలో రిలీజ్ కానుంది.