సరిలేరు సక్సెస్ గురించి స్పందించిన సూపర్‌స్టార్

’’సరిలేరు నీకెవ్వరు” ‘బ్లాక్ బస్టర్ కా బాప్’.. గురించి సూపర్ స్టార్ కృష్ణ స్పందన..

  • Publish Date - January 31, 2020 / 09:36 AM IST

’’సరిలేరు నీకెవ్వరు” ‘బ్లాక్ బస్టర్ కా బాప్’.. గురించి సూపర్ స్టార్ కృష్ణ స్పందన..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు‘ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్‌తో అలానే అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా ఏరియాల్లో బయ్యర్లకు లాభాలు కురిపిస్తున్న ఈ సినిమా చాలా సెంటర్స్‌లో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఇక ఈ సినిమా సక్సెస్‌పై సూపర్‌స్టార్ కృష్ణ గారు నేడు ఒక వీడియో బైట్ ద్వారా తన స్పందనను తెలియచేశారు.

ఆయన మాట్లాడుతూ : ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంత పెద్ద సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉందని, అలానే సినిమా సక్సెస్ అయ్యి పోస్టర్లపై బ్లాక్ బస్టర్ కా బాప్ అని హెడ్డింగ్ ఇవ్వడం చాలా బాగుందని, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుందనే నమ్మకం తనకు ఉందని, దర్శక నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసిన ఈ సినిమాలో నటించిన హీరో సూపర్ స్టార్ మహేష్, నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడిలకు కృష్ణ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు..

Read Also : చెంప దెబ్బకే విడాకులా? – తాప్సీ ‘తప్పడ్’ ట్రైలర్

ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు తన 27వ సినిమాని ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేష్ కౌబోయ్ తరహా పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.