మహేష్‌కి మోకాలి ఆపరేషన్ – రెండు నెలలు అమెరికాలో విశ్రాంతి?
సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలి సర్జరీ కోసం అమెరికా వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి..

సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలి సర్జరీ కోసం అమెరికా వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి..
సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి ఆపరేషన్ చేయించుకోవడానికే అమెరికా వెళ్లాడు. అవును.. లేకపోతే.. ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంకా పూర్తి అవ్వకముందే మహేష్ బాబు ఫారెన్ ఎందుకు వెళతాడు..? రష్మికతో మనం ఇంకా ఇలాంటి సక్సెస్ ఈవెంట్లకి రావాలి అన్న సూపర్ స్టార్ సడెన్‌గా ఈ ట్రిప్ ఎందుకు ప్లాన్ చేస్తాడు..?
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టాడు మహేష్ బాబు.. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కి సడెన్ బ్రేక్ పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ బాబు వెకేషన్ కోసం అమెరికా వెళ్లాడు.. అందుకే సరిలేరు సంబరాలకి బ్రేక్ పడింది అనుకుంటున్నారు అందరూ.
Read Also : గోపిచంద్ 28 ఫస్ట్‌లుక్
కట్ చేస్తే మహేష్ బాబు సడెన్ ట్రిప్ వెనక రీజన్ వేరే ఉంది. మహేష్ బాబు మోకాలికి ఆపరేషన్ చేయించుకోవడానికే అమెరికా వెళ్లాడని చెబుతున్నారు. ‘ఆగడు’ షూటింగ్ టైమ్‌లో మహేష్ మోకాలికి దెబ్బ తగిలింది. ఆ యాక్సిడెంట్ తర్వాత మళ్లీ సరిలేరు టైమ్‌లో పెయిన్ స్టార్ట్ అవ్వడంతో సర్జరీ సజెస్ట్ చేశారట డాక్టర్లు. ఆ మోకాలి సర్జరీ కోసమే పిల్లల ఎగ్జామ్స్ టైమ్‌లో కూడా వెకేషన్ అని చెప్పి అమెరికా వెళ్లారు మహేష్ అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు జస్ట్ ప్రీ ఆపరేటివ్ మెడికల్ చెకప్స్ కోసం వెళ్లిన మహేష్.. సర్జరీకి అంతా రెడీ అయితే వెంటనే సర్జరీ చేయించుకుంటాడట. ఒకవేళ కాస్త లేట్ అయ్యేలా ఉంటే.. ఇండియాకి వచ్చి మళ్లీ సర్జరీ కోసం వెళ్లి.. సర్జరీ తరవాత అక్కడే 3 నెలల పాటు రెస్ట్ తీసుకుని ఇండియా తిరిగి వస్తాడు.
మహేష్ ఇండియా వచ్చాక మరో రెండు నెలలు రెస్ట్ తర్వాత అప్పుడు షూటింగ్స్‌కి అటెండ్ అవుతాడట. ఇప్పటికే ‘మహర్షి’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో సినిమా కమిట్ అయ్యాడు మహేష్ బాబు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో లాస్ట్ ఇయర్ నుంచి బిజీగా ఉన్న మహేష్.. ఇప్పుడు ఈ సర్జరీ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేస్తాడని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. దీనికి సంబందించి మహేష్ తరపునుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇస్తేనే కానీ ఫ్యాన్స్ కాస్త కుదుటపడేలా కనిపిస్తున్నారు. కాగా శనివారం (జనవరి 25) నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ లో ఓ కొత్త సీన్ యాడ్ చేశారు.