Rajinikanth : ఇది ఏ తాత చేయని ప్రపంచ రికార్డు! మనవడిని స్కూల్లో డ్రాప్ చేసిన సూప‌ర్ స్టార్‌.. పిక్స్ వైర‌ల్‌

Rajinikanth : ఇది ఏ తాత చేయని ప్రపంచ రికార్డు! మనవడిని స్కూల్లో డ్రాప్ చేసిన సూప‌ర్ స్టార్‌.. పిక్స్ వైర‌ల్‌

Super star Rajinikanth drops his grandson at school fulfilling grandfather duties

Updated On : July 26, 2024 / 12:32 PM IST

Rajinikanth drops his grandson at school : సూప‌ర్ ర‌జినీకాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఎంత పెద్ద స్టార్ న‌టుడు అయిన‌ప్ప‌టికి కూడా ఎంతో సింపుల్‌గా ఉండేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక సినిమా షూటింగ్‌లు లేక‌పోతే త‌న కుటుంబ స‌భ్యుల‌తో గ‌డిపేందుకే ఇష్ట‌ప‌డుతుంటారు. తాజాగా ఆయ‌న రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

ఈ రోజు (శుక్ర‌వారం) త‌న కుమారుడు వేద్ పాఠ‌శాల‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ని చెప్పింది. అయితే.. సూప‌ర్ స్టార్ అయిన తాత అత‌డిని స్వ‌యంగా పాఠ‌శాల‌కు తీసుకువెళ్లాడంది. అంతేకాదు.. మ‌నువ‌డి క్లాస్ రూమ్‌కి వెళ్లిన ర‌జినీకాంత్‌ అక్క‌డ ఉన్న ఇత‌ర పిల్ల‌ల‌ను సంతోష‌పెట్టార‌ని చెప్పింది. ‘ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా.. ఏం చేసినా అతనే కింగ్, లవ్ యూ ఫాదర్’ అంటూ సౌంద‌ర్య పోస్ట్ చేసింది.

Janhvi Kapoor : జూనియ‌ర్ ఎన్టీఆర్ పై జాన్వీక‌పూర్‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం.. ఎనర్జిటిక్ హీరో.. నాకు 10 రోజులు ఆయ‌న‌కు..

ఈ పోస్ట్ వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ఇది ఏ తాత చేయని ప్రపంచ రికార్డు అని కొందరు స‌రదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రజనీకాంత్ ప్ర‌స్తుతం టిజె జ్ఞానవేల్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వెట్టయన్’ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూరైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది.

Jr Ntr-Prashant Neel : ఎన్టీఆర్‌-నీల్‌ కాంబోపై క్రేజీ న్యూస్‌..