Madurai
Madurai : చాలామందికి అభిమాన హీరో అంటే చెప్పలేనంత అభిమానం ఉంటుంది. కొందరు వాళ్ల స్టైల్‌ని ఫాలో అవుతారు. కొందరు వాళ్ల సినిమాలు ఎగబడి చూస్తారు. వారితో ఫోటోలు దిగాలని తాపత్రయపడతారు.. వాళ్ల పుట్టినరోజులు గ్రాండ్‌గా జరుపుతారు. ఇవన్నీ మామూలే.. కానీ ఓ అభిమాని తను అభిమానించే హీరోను దేవుడిగా కొలుస్తూ తను భక్తుడిగా మారిపోయాడు. తను ఆరాధించే హీరోకి గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. ఎక్కడంటే?
Rajinikanth : 33 ఏళ్ల తరువాత అమితాబ్ బచ్చన్‌తో రజినీకాంత్.. ఆసక్తికర వ్యాఖ్యలు
కుష్బూ, నయనతార, సమంత, నీతి అగర్వాల్ వంటి హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టడం గురించి విన్నాం. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఒకరు ఆయనకు గుడి కట్టేశాడు. అంతేనా నిత్యం పూజలు, హారతులు, అభిషేకాలు.. నిజమే. ఆ గుడి.. అక్కడి పూజలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Ram Gopal Varma : కారు రేసర్‌తో ఆర్జీవీ సినిమా.. ఇండియన్ ఫస్ట్ మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్..
మధురైకి చెందిన కార్తీక్ అనే రజనీకాంత్ వీరాభిమాని ఆయన కోసం గుడి కట్టాడు. ఆ గుడిలో 250 కిలోల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసాడు. విగ్రహం క్రింద తన తల్లిదండ్రుల ఫోటో, గణేశుని ఫోటో ఉంచాడు. ఇక ప్రతి రోజు రజనీకాంత్ విగ్రహానికి హారతులు, అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నాడు. రజనీకాంత్‌ను దేవుడిగా.. తానో భక్తుడిగా మారిపోయాడు కార్తీక్. ఈ అభిమాని గురించి రజనీకాంత్ వరకు చేరిందో లేదో తెలియదు కానీ ఇతని గుడి, పూజలు మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కాగా రజనీకాంత్ తాజాగా లీడర్ 170 మూవీతో బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి ముంబయిలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు. లీడర్ 170 సినిమా 2014 సమ్మర్‌కి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
#Watch | மதுரை: திருமங்கலத்தைச் சேர்ந்த கார்த்திக் என்பவர் நடிகர் ரஜினிகாந்த்துக்கு கோயில் கட்டி, 250 கிலோ எடை கொண்ட கருங்கல்லில் அவருக்கு சிலை வைத்து நாள்தோறும் வழிபட்டு வருகிறார்.#SunNews | #Madurai | @Rajinikanth pic.twitter.com/RXut6Ot1W4
— Sun News (@sunnewstamil) October 26, 2023