Pawan Kalyan : ఫ‌స్టు సినిమా హీరోయిన్‌ను క‌లిసిన డిప్యూటీ సీఎం..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా ప‌రిచ‌య‌మైన సినిమా 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’.

Pawan Kalyan – Supriya : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా ప‌రిచ‌య‌మైన సినిమా ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’. ఈ మూవీతోనే నాగార్జున మేన కోడలు సుప్రియ సైతం కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా త‌రువాత ప‌వ‌న్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగారు. టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. అనంత‌రం పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో క‌ష్టాల‌ను ఓర్చుకున్నారు. బీజేపీ, జ‌న‌సేన, టీడీపీ కూట‌మి ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఆంధ్రప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌గా ఉప ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాణం చేశారు. మ‌రోవైపు తొలి సినిమా త‌రువాత సుప్రియ సినిమాలు మానేసింది. ఆమె అన్న‌పూర్ణ స్టూడియో బాధ్య‌త‌ల‌ను చూసుకుంటున్నారు. నిర్మాత‌గా ప‌లు చిత్రాల‌ను నిర్మించారు.

Kalki Team Interview : ‘కల్కి’ మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్.. ‘కల్కి’ సినిమా గురించి ఎవరెవరు ఏం మాట్లాడారంటే..

కాగా.. నేడు(సోమ‌వారం) డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాత‌లు విజ‌య‌వాడ‌లోని క్యాంపు కార్యాల‌యంలో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో సుప్రియ సైతం పాల్గొంది. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి, డిప్యూటీ సీఎం అయినందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సుప్రియ అభినంద‌న‌లు తెలియ‌జేసింది. అనంత‌రం ప‌వ‌న్‌తో ఫోటోలు దిగింది.

కాగా.. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. ఇక‌ కొంద‌రు అభిమానులు తొలి చిత్రంలో న‌టించిన ఫోటోల‌తో పాటు ప్ర‌స్తుతం ఫోటోల‌ను పోస్ట్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు