Suresh Babu
Suresh Babu : తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్) ఎన్నికలు నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగాయి. ఓటింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు జరగ్గా తాజాగా ఈ ఫలితాలను ప్రకటించారు.(Suresh Babu)
ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో చిన్న నిర్మాతల మద్దతుతో సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు నేతృత్వంలో ‘మన ప్యానెల్’ ఒక వైపు మరో వైపు రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు మద్దతుతో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ పోటీ చేసారు. ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియో రంగాల సభ్యులు మొత్తం కలిపి దాదాపు 3,355 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read : Ariyana Glory : అతను 8 లక్షలు మోసం చేసాడు.. నాకు ఇప్పుడు మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి.. అరియనా కామెంట్స్..
ఈ ఎన్నికల ద్వారా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శితో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా నాగవంశీ, కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పాటైన కార్యవర్గం 2027 వరకు విధుల్లో కొనసాగుతుంది. ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి 31 మంది గెలిచారు. 17 మంది మన ప్యానల్ నుంచి గెలిచారు.