Suriya 42: సూర్య సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రభాస్.. మోషన్ పోస్టర్ అదిరిపోయిందిగా
తమిళ్ హీరో సూర్యకి తెలుగులో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్ల లేదు. గజినీ సమయం నుంచి అతడు నటించిన ప్రతి మూవీని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు. కాగా సూర్య 42వ సినిమాగా తమిళ్ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
![Suriya 42: సూర్య సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రభాస్.. మోషన్ పోస్టర్ అదిరిపోయిందిగా Suriya 42: సూర్య సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రభాస్.. మోషన్ పోస్టర్ అదిరిపోయిందిగా](https://10tv.in/wp-content/uploads/2022/09/Suriya-42-Movie-with-Prabhas-UV-Creations.jpg)
Suriya 42 Movie with Prabhas UV Creations
Suriya 42: తమిళ్ హీరో సూర్యకి తెలుగులో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్ల లేదు. గజినీ సమయం నుంచి అతడు నటించిన ప్రతి మూవీని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సూర్య, వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ పోతున్నాడు.
Prabhas: ఆదిపురుష్ నుంచి అప్డేట్ అప్పుడేనా.. క్లారిటీ ఇచ్చిన ఓమ్ రౌత్!
ఇటీవల విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ మూవీలో కనిపించింది 3నిమిషాలే అయినా, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అందర్నీ మెస్మరైజ్ చేశాడు. అలాగే అతని సినిమా ‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్ లో కూడా గెస్ట్ గా మెరవబోతున్నాడు. కాగా సూర్య 42వ సినిమాగా తమిళ్ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం చిత్ర యూనిట్ ఆ సినిమా యొక్క థీమ్ ని చెబుతూ ఒక మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఆ పోస్టర్ చూస్తుంటే సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళంతో పాటు 10 భాషలో ఈ సినిమా విడుదలకాబోతున్నట్టు ఆ పోస్టర్ లో ప్రకటించారు. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ “యూవీ క్రియేషన్స్”, తమిళ్ నిర్మాణ సంస్థ “స్టూడియో గ్రీన్”తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మోషన్ పోస్టర్ చూశాక ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
We seek all your good wishes as we begin our adventure!https://t.co/18rEmsLxom #Suriya42 @directorsiva @ThisIsDSP @DishPatani @iYogiBabu @vetrivisuals@kegvraja @StudioGreen2 @UV_Creations
— Suriya Sivakumar (@Suriya_offl) September 9, 2022