Kanguva – Suriya : మొసలితో ఫైట్ సీన్ కోసం.. వారం రోజులు నీళ్లలోనే.. కంగువా కోసం సూర్య కష్టం..

డైరెక్టర్ శివ కంగువ సినిమాలో సూర్య ఎంత కష్టపడ్డారో తెలిపారు.

Suriya Hard Work for Kanguva Movie Director Shiva Comments goes Viral

Kanguva – Suriya : తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్. మంచి మార్కెట్ ఉంది. సూర్య చేసిన భారీ సినిమా కంగువ నవంబర్ 14న రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ వచ్చి కంగువ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు మూవీ టీమ్.

Also Read : Suriya – Balayya : బాలయ్య గురించి ఓ రేంజ్ లో చెప్పిన సూర్య.. అన్‌స్టాపబుల్‌ షూట్ తర్వాత ఏమన్నారంటే..?

ఈ క్రమంలో డైరెక్టర్ శివ కంగువ సినిమాలో సూర్య ఎంత కష్టపడ్డారో తెలిపారు. శివ మాట్లాడుతూ.. సినిమాలో మొసలితో ఉండే ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటుంది. ఈ సీన్ కోసం వేల మంది పనిచేసారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ ని బ్యాంకాక్ లో, చెన్నైలో షూట్ చేసాము. ఆ సీన్ కోసం దాదాపు సూర్య వారం రోజుల పాటు నీళ్లలోనే ఉంటూ నటించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన్ని బాగా కష్టపెడుతున్నాను ఏమో అని అనిపించింది. ఆయన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని అన్నారు. దీంతో ఆ మొసలి సీన్, సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.