Suriya – Balayya : బాలయ్య గురించి ఓ రేంజ్ లో చెప్పిన సూర్య.. అన్‌స్టాపబుల్ షూట్ తర్వాత ఏమన్నారంటే..?
అన్‌స్టాపబుల్ షూట్ అయ్యాక నిన్న రాత్రి జరిగిన ప్రెస్ మీట్ లో షో ప్రస్తావన రాగా సూర్య బాలయ్య గురించి మాట్లాడారు.

Suriya Interesting Comments on Balakrishna after Unstoppable show Shoot
Suriya – Balayya : తమిళ్ స్టార్ హీరో సూర్య త్వరలో కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా నిన్న కంగువ టీమ్ హైదరాబాద్ లో ప్రమోషన్స్ చేసారు. అలాగే సూర్య, బాబీ డియోల్, డైరెక్టర్ శివ ముగ్గురు కంగువ ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి కూడా వెళ్లారు.
ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ గా వస్తున్న అన్‌స్టాపబుల్ షో నాలుగో సీజన్ నేటి నుంచే మొదలు కానుంది. మొదటి ఎపిసోడ్ సీఎం చంద్రబాబు నాయుడుతో చేయగా ఇవాళ రాత్రికి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ కూడా షూట్ అయ్యాయి. తాజాగా నేడు సూర్య, కంగువ టీమ్ కూడా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొని బాలయ్యతో సందడి చేసారు.
Also Read : Pottel : ‘పొట్టేల్’ మూవీ రివ్యూ.. కథ మంచిదే.. కానీ కథనమే..
అన్‌స్టాపబుల్ షూట్ అయ్యాక నిన్న రాత్రి జరిగిన ప్రెస్ మీట్ లో షో ప్రస్తావన రాగా సూర్య బాలయ్య గురించి మాట్లాడారు. సూర్య మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు నిజంగానే అన్‌స్టాపబుల్. కంగువా గురించి చాలా విషయాలు మాట్లాడాము. గతంలో పలుమార్లు సినీ వేడుకల్లో కలుసుకున్నాము కానీ ఎక్కువసేపు మాట్లాడలేదు. బాలకృష్ణ గారితో చాలా సేపు మాట్లాడటం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఆయన సమయపాలన చూసి ఆశ్చర్యపోయాను. పని విషయంలో ఆయన అంకిత భావంతో ఉంటారు. రోజూ పొద్దున్నే 3.30 గంటలకే నిద్ర లేచే ఆయనలో అసలు అలసట కనిపించదు అంటూ బాలయ్యని పొగిడేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.